IPL Auction 2021: ఐపీఎల్ మీని వేలం.. ఏ ఫ్రాంఛైజీ వద్ద ఎంత నగదు ఉందంటే

ఐపీఎల్ సీజన్ 14 మినీ వేలానికి రంగం సిద్దమైంది.

Update: 2021-02-18 09:39 GMT

IPL2021

ఐపీఎల్ సీజన్ 14 మినీ వేలానికి రంగం సిద్దమైంది. కాసేపట్లో మీని వేలం ప్రారంభంకానుంది. ఈ సారి చెన్నై వేదికగా ఈ వేలం నిర్వహించనున్నారు. ఏప్పటిలాగే వేలంలో ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిపించేందుకు ఎనిమిది ఫ్రాంచైజీలు పోటిపడనున్నాయి. గత ఏడాది కరోనా కారణంగా ఐపీఎల్13 వాయిదా పడుతూ వచ్చి ఏట్టకేలకు చివరకు యూఏఈకి తరలిన సంగతి తెలిసిందే. ఈ సారి భారత్‌కు తిరిగొస్తుండడంతో ఇక్కడ పిచ్ లకు అలవాటు పడిన ప్లేయర్లను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బీసీసీఐ గురువారం ఆటగాళ్ల జాబితాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి ఐపీఎల్ కు మొత్తంగా 1,114 మంది ప్లేయర్లు పేరు రిజిస్టర్ చేసుకోగా.. ఫ్రాంచైజీల విజ్ఞాప్తి మేరకు 292 మంది ఆటగాళ్లను ఫైనల్ చేసింది బీసీసీఐ. వేలంలో మొత్తం 164 మంది భారత ఆటగాళ్లు, 125 మంది విదేశీ క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. ఎప్పటిలానే ఈ సారి కూడా ఐపీఎల్ లో 8 జట్లు పోటీపడనున్నాయి. గత నెలలో అత్యధికంగా 10 మందిని బెంగళూరు రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ జట్టు 11 మంది క్రికెటర్లను తీసుకునే చాన్స్ ఉంది.

ఈ సారి ఐపీఎల్ మీని వేలం విశేషాలు

అన్ని టీమ్‌లలో 61 స్థానాలు ఖాళీ

అత్యధిక ఖాళీలున్న జట్లు పంజాబ్‌, రాజస్థాన్‌

రెండు జట్లు చెరో 9 మంది చొప్పున కొనుగోలు చేసే అవకాశం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో 11,

సన్‌రైజర్స్‌ లో మూడు స్థానాలు ఖాళీ

ఆర్సీబీ వద్ద మిగిలిన మొత్తం నగదు రూ.35.4 కోట్లు

రాజస్థాన్‌ వద్ద రూ.37.85 కోట్లు

పంజాబ్‌ కింగ్స్ వద్ద రూ.53.2 కోట్లు నగదు

ఢిల్లీ వద్ద ఉన్న నగదు రూ.13.4 కోట్లు

కోల్‌కతా వద్ద రూ.10.75 కోట్లు

ముంబయి ఇండియన్స్‌ 7 మంది ఆటగాళ్లు అవసరం

వారివద్ద ఉన్ననగదు రూ.15.35 కోట్ల

చెన్నై సూపర్‌ కింగ్స్‌ వద్ద రూ.19.9 కోట్ల నగదు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ద్ద ఉన్న రూ.10.75 కోట్లు

ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెటర్ నూర్ అహ్మద్ అతిపిన్న వయసు ఆటగాడు

నూర్ అహ్మద్ వయస్సు కేవలం 16 ఏళ్ళే

నయన్ దోషి అందరికి కంటే పెద్దవాడు

నయన్ దోషి వయసు 42 సంవత్సరాలు

Tags:    

Similar News