DC vs KKR: ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యం 155 ; రాణించిన శుభ్‌మన్, రస్సెల్

DC vs KKR: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా టీం 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.

Update: 2021-04-29 15:42 GMT
ఢిల్లీ వర్సెస్ కోల్‌కతా మ్యాచ్ (ఫొటో ట్విట్టర్)

DC vs KKR: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా టీం 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ టార్గెట్ 155 లుగా డిసైడ్ అయింది.

కోల్‌కతా టీం ఈ మ్యాచ్ లోనూ బ్యాటింగ్ చేయడంలో విఫలమైంది. మరోసారి తక్కువ స్కోర్ కే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్ల ధాటికి పేకమేడలా కుప్పకూలింది. కోల్‌కతా టీంలో శుభ్‌మన్ తప్ప మిగతా వారెవరు బ్యాట్ ఝలిపించలేక చేతులెత్తేశారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన నితిష్ రానా, శుభ్ మన్ గిల్ మొదట్లో ధాటిగా ఆడేలోపే మొదటి వికెట్ కోల్పోయింది. 3.4 ఓవర్లో అక్షర్ పటేల్ నితిష్ రానా(15)ను పెవిలియన్ చేర్చాడు.

ఆ తరువాత వచ్చిన ఏ బ్యాట్స్‌మెన్స్ కూడా 20 పరుగులు కూడా చేయకుండానే వెనుదిరిగారు. ఒక్క శుభ్‌మన్ గిల్ (43 పరుగులు) మాత్రమే హాఫ్ సెంచరీకి చేరువలోకి వచ్చి ఔటయ్యాడు. చివర్లో ఆండ్రూ రస్సెల్ (45 పరుగులు, 27 బంతులు, 2ఫోర్, సిక్స్‌లు) హిట్టింగ్ చేయడంతో ఆ మాత్రం స్కోరైనా సాధించింది.

ఇక ఢిల్లీ బౌలర్లో అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ చెరో రెండు వికెట్లు, అవేష్ ఖాన్, స్టోయినీస్ తలో వికెట్ పడగొట్టారు.

Tags:    

Similar News