IPL 2021 DC vs MI: ఢిల్లీ లక్ష్యం 138; బౌలర్ల ధాటికి కుప్పకూలిన ముంబై ఆటగాళ్లు

IPL 2021 DC vs MI : ఐపీఎల్ 2021లో భాగంగా నేడు చెపాక్‌ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ మ్యాచ్ జరుగుతోంది.

Update: 2021-04-20 15:46 GMT
ఢిల్లీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన ముంబై టీం

IPL 2021 DC vs MI: ఐపీఎల్ 2021 లో భాగంగా నేడు చెపాక్‌ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు 9వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ టార్గెట్ 138 పరుగులుగా నిర్దేశించింది ముంబై.

టాస్ గెలిచిన ఆనందం ముంబై కి లేకుండా చేశారు ఢిల్లీ బౌలర్తు. ముంబై ఇండియన్స్‌ బ్యాట్స్‌మెన్స్ పరుగులు రాబట్టేందుకు చాలా కష్టపడ్డారు. క్వింటన్‌ డికాక్‌ రూపంలో తొలి వికెట్‌ కోల్పోయింది ముంబై టీం. స్టోయినిస్‌ వేసిన 3వ ఓవర్‌ తొలి బంతికి కీపర్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. డికాక్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌తో కలిసి రోహిత్‌ క్రీజులో నిలదొక్కుకుంటూనే పరుగులు రాబట్టారు. ఇద్దరు కలిసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నిర్మించారు. ధాటిగా ఆడుతున్న సూర్యకుమార్‌ను(15 బంతుల్లో 24; 4 ఫోర్లు) ఆవేశ్‌ ఖాన్‌ బోల్తా కొట్టించాడు. ఇక ఆ తరువాత ముంబై వరుసగా వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది.

రోహిత్‌ శర్మ(30 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) వెటరన్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా వేసిన ఫ్లయిటెడ్‌ బంతికి క్రీజ్‌ వదిలి ముందుకు వచ్చిన రోహిత్‌... లాంగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న స్టీవ్‌ స్మిత్‌ చేతికి చిక్కి పెవిలియన్‌ బాటపట్టాడు.

అనంతరం వచ్చిన హార్దిక్ పాండ్య కూడా అదే ఓవర్లో డకౌట్ గా పెవిలియన్ చేరి నిరాశపరిచాడు. క్రునాల్ పాండ్యా, కీరన్ పోలార్డ్ కూడా సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు. 11 ఓవర్లకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన జయంత్ యాదవ్(18 బంతుల్లో 20; 1 ఫోర్, సిక్సర్లు) తో కలిసి ఇషాంత్ కిషన్(28 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) చెప్పుకోదగిన స్కోర్ చేసేందుకు సహాయపడ్డారు.

ఢిల్లీ బౌలర్లలో అమిత్ మిశ్రా 4 వికెట్లు తీసి ముంబైని ఏ దశలోనూ కోలుకోకుండా చేశాడు. స్లోయినిస్, అవేశ్ ఖాన్, లలిత్ యాదవ్ తలో వికెట్ తీశారు. రబాడా ఒక్కడే ధారాళంగా పరులిచ్చాడు. మిగతా బౌలర్లందరూ ముంబై టీం పరుగులు చేయకుండా అడ్డుకున్నారు.  

Tags:    

Similar News