IPL 2020: అదే ధోనీ సక్సెస్ ఫార్ములా

IPL 2020: మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ 2020 సీజన్‌కు తెరలేవనున్న ఈ త‌రుణంలో ప్రముఖ క్రికెట‌ర్లు ఐపీఎల్ టీంల బ‌లాబలాలు, వారిలోని లోటుపాట్లల‌పై విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు.

Update: 2020-09-14 14:33 GMT

between MS Dhoni and Virat Kohli’s captaincy

IPL 2020: మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ 2020 సీజన్‌కు తెరలేవనున్న ఈ త‌రుణంలో ప్రముఖ క్రికెట‌ర్లు ఐపీఎల్ టీంల బ‌లాబలాలు, వారిలోని లోటుపాట్లల‌పై విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ టీవీ షోలో పాల్గొన్న టీమిండియా మాజీ ఆట‌గాడు గౌత‌మ్ గంభీర్.. ధోనీ, కోహ్లీ కెప్టెన్సీల తేడాను విశ్లేషించాడు. ఐపీఎల్‌లో ఆటగాళ్లపై నమ్మకం ఉంచడం, జట్టుపై ఎంపికపై పూర్తి అవగాహన ఉండటమే ఎంఎస్ ధోనీ సక్సెస్ ఫార్ములా అని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఈ లక్షణం ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడంతోనే ఆ జట్టు విఫలమైందన్నాడు.

ఇక విరాట్‌ కోహ్లీకి జట్టు ఎంపిక గురించి పెద్దగా అవగాహన లేదని, అసలు తన అత్యుత్తమ ఎలెవన్‌ జట్టు ఎలా ఉండాలో విరాట్‌కు తెలియని సందర్భాలు చాలానే ఉన్నాయని విమర్శలు గుప్పించాడు. కేవలం ఆర్‌సీబీ బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంటే సరిపోతుందనే కోహ్లీ ఎప్పుడూ భావిస్తాడ‌ని, సీఎస్‌కే జట్టులో ధోనీ ఆటగాళ్లపై నమ్మకం ఉంచి వారినే కనీసం ఆరు-ఏడు మ్యాచ్‌ల వరకూ కొనసాగిస్తూ ఉంటుంది. కానీ.. కోహ్లీ మాత్రం చాలా తొందరగా ఆటగాళ్లను మారుస్తారు. ఇదే ధోనీ-కోహ్లీ సారథ్యంలో ఉన్నా ప్రధాన తేడా. అటు సీఎస్‌కే సక్సెస్‌‌కు.. ఇటు ఆర్‌సీబీ వైఫల్యానికి కూడా ఇదే కారణం.

స్టార్ ఆటగాళ్లున్నా.. ఆర్‌సీబీ ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. రెండు సార్లు ఆ అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. గత మూడు సీజన్లలోనైతే ఆ జట్టు ప్రదర్శన మరి దారుణం. పాయింట్స్ టేబుల్లో చివరి స్థానాల్లో నిలిచింది. దీంతో కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలనే డిమాండ్ కూడా వ్యక్తమైంది. ఈ సారి ఆ లోపాన్ని సరిదిద్దుకొని టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. మరీ ఈ సారైనా టైటిల్ సాధిస్తుందో వేచి చూడాలి.  

Tags:    

Similar News