IPL 2020: రైనా రీఎంట్రీ ఇవ్వనున్నడా?!
IPL 2020: ఐపీఎల్ ఇంకా ప్రారంభం కాలేదు. నేడు షెడ్యూల్ వస్తుందని బ్రిజేశ్ పాటిల్ ప్రకటించారు. ఎప్పుడైనా సరే.. సిరీస్ ప్రారంభమైన తరువాత.. ఏ ఆటగాడైనా అద్బుతమైన ఆటతీరు కనబరిస్తే.. అభిమానులు గూగుల్ లో అతని గురించి ఎక్కువగా సర్చ్ చేశారు .
IPL 2020: ఐపీఎల్ ఇంకా ప్రారంభం కాలేదు. నేడు షెడ్యూల్ వస్తుందని బ్రిజేశ్ పాటిల్ ప్రకటించారు. ఎప్పుడైనా సరే.. సిరీస్ ప్రారంభమైన తరువాత.. ఏ ఆటగాడైనా అద్బుతమైన ఆటతీరు కనబరిస్తే.. అభిమానులు గూగుల్ లో అతని గురించి ఎక్కువగా సర్చ్ చేశారు . కానీ, గత రెండు వారాలుగా.. ఓ ఆటగాని పేరు మోస్ట్ సర్చ్ండ్ కీ వర్డ్ గా మారిపోయింది. అతడే భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా.
దానికి కారణం అతడు అర్ధాంతరంగా యూఏఈ నుంచి ఇండియాకు రావడం. అతడు ఇండియాకు రావడానికి రెండు కారణాలు చెప్పారు. మొదటిది.. తన కుటుంబంలో జరిగిన ఓ దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందనీ, ఈ సందర్భంలో తన కుటుంబానికి తన అవసరం ఏంతైనా ఉందనీ, ఫ్యామిలీకి సపోర్టుగా ఉండాలని చెప్పారు. మరోకటి బయోబబుల్ వాతావరణంలో తాను ఉండలేకపోయాననీ, అక్కడ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయని చెప్పుకోచ్చారు. ఇండియా వచ్చిన తరువాత.. తాను క్వారెంటైన్ లో ఉన్నా కూడా ప్రాక్టీస్ చేస్తున్ననీ, ఏ క్షణంలోనైనా.. నన్ను యూఏఈలో చూడవచ్చునని అన్నారు. దీంతో సీఎస్‌కే అభిమానులందరూ చాలా ఖుషి అయ్యారు. ఎందుకంటే రైనా వస్తున్నడంటే చెన్నై టీంకు కొండంత అండ.
ఓ క్రికెట్ విశ్లేషకుడు చెప్పుతున్న మాటేమిటంటే.. కచ్చితంగా తను ఐపీఎల్‌కు వస్తారు. అతడు యూఏఈ లో క్రికెట్ ఆడాలంటే .. 12 సార్లు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని. అలాగే 6 రోజుల పాటు క్వారెంటైన్లో ఉండాలి. కానీ కొన్ని మ్యాచ్‌లు మిస్ అయ్యే అవకాశం ఉంది.
ఇక్కడ వస్తున్న మరో మాటేమిటంటే.. సీఎస్‌కే గానీ, బీసీసీఐ ఒప్పుకుంటుందా? ఇక్కడ బీసీసీఐ ఒప్పుకునే అవకాశం చాలా తక్కువనే అని చెప్పాలి. ఎందుకంటే.. బీసీసీఐ సమాకూర్చిన సదుపాయాలు బాగాలేవని, అక్కడి వాతావరణం కూడా సరైనా విధంగా లేదని వెళ్లిపోయారు. ఈ ప్రశ్నలు రేస్ చేసే అవకాశముంది. కానీ.. రైనా వస్తానంటే.. అతని ఏంట్రీకి ఒక్కడు మాత్రమే లైన్ క్లీయర్ చేసే అవకాశముంది. అతడే ఎంఎస్ ధోనీ..
ధోనీ , రైనా ల అనుబంధం ఎలాంటిదో చెప్పనకరలేదు. రైనా వస్తానంటే మాత్రం ధోని కచ్చితంగా లైన్ క్లీయర్ చేశారు. రైనా రీఫ్లేస్ మెంట్‌కే ఎక్కువ అవకాశం ఉందనీ చెప్పాలి. ఎందుకంటే.. హర్భజన్ స్థానంలో ఇతర బౌలర్లను చూస్తున్నారు కానీ, రైనా ఫ్లేస్‌లో ఇతర ఆటగాళ్లను ఇప్పటివరకూ పూర్తి చేయలేదు. ఈ పరిణామాలను బట్టి రైనా తిరిగి టీమ్‌లో చేరనున్నడనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఏం జరుగుతుందో.. ఏ జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుందో వేచి చూడాల్సిందే..
.