IPL 2020: హైదరాబాద్ 'రైజింగ్'.. బెంగుళూర్ 'చాలెంజ్' నేడే
IPL 2020: ఓపెనర్లు దంచికొట్టడం.. బౌలర్లు జెట్ స్పీడ్‌తో బంతులను విసరడం సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పెషల్.. హైదరబాద్ బిర్యానీ ఫేమసో.. సన్‌రైజర్స్ ఓపెనర్లు కూడా అంతే ఫేమస్.. ఒక వైపు జానీ బెయిర్‌స్టో వీరబాదుడు బాదితే..
IPL 2020: ఓపెనర్లు దంచికొట్టడం.. బౌలర్లు జెట్ స్పీడ్‌తో బంతులను విసరడం సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పెషల్.. హైదరబాద్ బిర్యానీ ఫేమసో.. సన్‌రైజర్స్ ఓపెనర్లు కూడా అంతే ఫేమస్.. ఒక వైపు జానీ బెయిర్‌స్టో వీరబాదుడు బాదితే.. మరో వైపు వార్నన్ .. ఆయన బరిలోకి దిగితే వార్ వన్ సైడే. ప్రత్యర్థికి పట్టపగలే చుక్కలు కనిపించడం గ్యారెంటీ. ప్రస్తుతం ఏ జట్టుకు ఇలాంటి ఓపెనర్లు లేరంటే అతియోక్తి కాదు.
వీరితో పాటు ఈ జట్టుకు మనీశ్ పాండే, మిచెల్ మార్ష్, ఫాబియాన్ అలెన్ కూడా విధ్వంస సృష్టించడం గ్యారంటీ.. ఈ జట్టుకు మరో ఫ్లస్ పాయింట్ బౌలింగ్. అఫ్గాన్ బౌలర్లు రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీలతో పాటు భువనేశ్వర్, షాబాజ్ నదీమ్ తమదైన శైలిలో ప్రత్యర్థి బ్యాట్‌మెన్స్‌పై విరుగుచుక పడటం ఖాయం. ఓ సారి చాంఫియన్‌గా.. మరో సారి రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ యూఏఈ గడ్డపై దుమ్ము దులిపేందుకు సిద్ధమైంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి హట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న ఒక్కసారి కూడా టైటిల్ గెలవలే కపోయింది. ప్రతీసారి ఈ జట్టు అన్ని విభాగాల్లోని బలంగా కనిపిస్తున్నప్పటికీ అసలు సిసలు ఆటకు వచ్చేసరికి బలహీనపడుతోంది. 2009, 2016 లో ఫైనల్‌కు చేరడం మినహాయించి ఏ సీజన్ లోనూ ఆకట్టుకోలేదు. 2019 సీజన్‌లోనూ ఆర్‌సీబీ చివరి ప్లేస్‌కు పరిమితమైంది.
కానీ ఈ సారి దుబాయ్ చేరినప్పటి నుంచి కచ్చితమైన ప్రణాళిక ప్రకారం సన్నద్ధమ వుతుంది. ఈ సీజన్‌లో తమ జట్టు రాత మార్చాలనే దృఢ సంకల్పంతో కెప్టెన్ కోహ్లీ ఉన్నాడు. అంతా తానై నడిపించే కోహ్లికి ఈ సారి ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు ఆరోన్ ఫించ్ తోడయ్యాడు. అలాగే .. వీరికి తోడు 'మిస్టర్ 360' ప్లేయర్ ఏబీ డివిలియర్స్, శివమ్ దూబే, క్రిస్ మోరిస్ ఉన్నారు. వీరు బ్యాట్ ఝళిపిస్తే చూస్తుండగానే భారీ స్కోరు నమోదు కావడం ఖాయం. బౌలింగ్‌లో ఎప్పటిలాగే స్పిన్నర్ యజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్, పవన్ నేగి, ఆడమ్ జంపా, మొయిన్ అలీ కీలకం కానున్నారు. జట్టు నిండా స్టార్లతో కూడిన ఆర్‌సీబీకి అదృష్టం తోడైతే టైటిల్ సాధించడం కష్టమేమీ కాదు.
తొలిమ్యాచ్‌లో భాగంగా డేవిడ్ వార్నర్ జట్టు సెప్టెంబర్ 21 సోమవారం రోజున రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగనున్నది. ఇక వేచి చూడాలి ఏ జట్టు పై చేయి సాధిస్తుందో.