IPL 2020: సన్‌రైజర్స్ చేతిలో ఢిల్లీ చిత్తు!
IPL 2020 : సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆల్రౌండ్ ప్రతిభతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై ఘన విజయం సాధించి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆదరగొట్టేసింది. డేవిడ్ వార్నర్ రెచ్చిపోయిన వేళ. సాహా సుడిగాలి ఇన్నింగ్స్ తోడవటంతో భారీ స్కోరు సాధించిన సన్‌రైజర్స్ టీం తరువాత ప్రత్యర్ధి ఢిల్లీ క్యాపిటల్స్ ను సూపర్ బౌలింగ్ తొ కట్టి పాడేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను 88 పరుగుల తేడాతో ఓడించి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
మంగళవారం జరిగిన ఐపీఎల్ 2020 లీగ్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ భారీ స్కోరు సాధించింది. వార్నర్ (34 బంతుల్లో 66 పరుగులు) కు సాహా (45 బంతుల్లో 87పరుగులు) తోడవడంతో సన్‌రైజర్స్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. దీంతో కేవలం రెండు వికెట్లు కోల్పోయి సన్‌రైజర్స్ 219 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఈ భారీ స్కోరును చేదించడంలో ఢిల్లీ బ్యాట్స్ మెన్ తడబడ్డారు. సన్‌రైజర్స్ బౌలర్ల ముందు చేతులెత్తేశారు. మొదటి ఓవర్ లోనే ధావన్(0) అవుట్ అయ్యాడు. తరువాత స్టాయినిస్ (5) వెంటనే వెనుదిరిగాడు. దీంతో 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది ఢిల్లీ జట్టు. తరువాత కూడా రషీద్‌ఖాన్ (3/7) దెబ్బకు ఢిల్లీ జట్టు కోలుకోలేకపోయింది. రహానె (26)తో పాటు హెట్‌మయర్ (16)ను ఒకే ఓవర్లో ఔట్ చేసిన రషీద్ ఢిల్లీ పతనాన్ని శాసించాడు. ఈ దెబ్బకు ఢిల్లీ జట్టు 19 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో రిషబ్ పంత్ ఒక్కడే 36 పరుగులు చేశాడు. ఇక సాహాకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
స్కోర్లు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) అక్షర్ (బి) అశ్విన్ 66; సాహా (సి) శ్రేయస్ (బి) నార్జ్ 87; పాండే నాటౌట్ 44; విలియమ్సన్ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం: (20 ఓవర్లలో 2 వికెట్లకు) 219;
వికెట్ల పతనం: 1-107, 2-170;
బౌలింగ్: నార్జ్ 4-0-37-1; రబాడ 4-0-54-0; అశ్విన్ 3-0-35-1; అక్షర్ పటేల్ 4-0-36-0; తుషార్ 3-0-35-0; స్టాయినిస్ 2-0-15-0
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: రహానె ఎల్బీ (బి) రషీద్ 26; ధావన్ (సి) వార్నర్ (బి) సందీప్‌శర్మ 0; స్టాయినిస్ (సి) వార్నర్ (బి) నదీమ్ 5; హెట్‌మయర్ (బి) రషీద్ 16; పంత్ (సి) గోస్వామి (బి) సందీప్ 36; శ్రేయస్ (సి) విలియమ్సన్ (బి) శంకర్ 7; అక్షర్ పటేల్ (సి) గార్గ్ (బి) రషీద్ 1; రబాడ (బి) నటరాజన్ 3; అశ్విన్ (సి) సమద్ (బి) హోల్డర్ 7; దేశ్‌పాండే నాటౌట్ 20; నార్జ్ (సి) గార్గ్ (బి) నటరాజన్ 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (19 ఓవర్లలో ఆలౌట్) 131;
వికెట్ల పతనం: 1-1, 2-14, 3-54, 4-55, 5-78, 6-83, 7-103, 8-103, 9-125;
బౌలింగ్: సందీప్ శర్మ 4-0-27-2; నదీమ్ 1-0-8-1; హోల్డర్ 4-0-46-1; రషీద్ 4-0-7-3; నటరాజన్ 4-0-26-2; శంకర్ 1.5-0-11-1; వార్నర్ 0.1-0-2-0