తడబడ్డ బెంగుళూరు.. హైదరాబాద్ లక్ష్యం 121
హైదరాబాద్, బెంగళూరు జట్ల మద్య జరుతున్న మ్యాచ్ లో ముందుగా టాస్ ఒడి బ్యాటింగ్ కి దిగిన బెంగుళూరు జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో ఏడూ వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది
హైదరాబాద్, బెంగళూరు జట్ల మద్య జరుతున్న మ్యాచ్ లో ముందుగా టాస్ ఒడి బ్యాటింగ్ కి దిగిన బెంగుళూరు జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో ఏడూ వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. ముందుగా బ్యాటింగ్ కి దిగిన బెంగుళూరు జట్టుకు ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ పడిక్కల్ (5) పరుగులకే అవుట్ అయ్యాడు. ఇక ఈ షాక్ నుంచి బయటకు రాకముందే ఆ జట్టుకు మరో షాక్ తగిలింది. సందీప్ శర్మ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి విలియమ్సన్ చేతికి చిక్కి కోహ్లీ (7) ఔట్ అయ్యాడు. దీనితో బెంగళూరు జట్టు 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
ఇక ఆ తర్వాత డివిలియర్స్ (24) , ఫిలిప్ (32) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ జట్టు స్కోర్ పెంచారు. అయితే 12 ఓవర్ వచ్చేసరికి ఈ ఇద్దరు వెనువెంటనే అవుట్ అయ్యారు. అప్పటికి బెంగుళూరు జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 76 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత ఆ జట్టును సుందర్ (21) కొద్దిసేపు ఆదుకున్నాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ వంద స్కోర్ ని దాటించాడు. ఈ క్రమంలో హోల్డర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నం చేసి వార్నర్ కి చిక్కాడు. దీనితో 20 ఓవర్లు అయిపోయేసరికి ఆ జట్టు ఏడూ వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది.