IPL 2020: పంజాబ్, రాజస్థాన్‌ల రసవత్తర పోరు నేడే
IPL 2020: తొలి మ్యాచ్‌లో ఎవ్వరూ ఊహించని విధంగా అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించి.. చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్ రాజస్తాన్ ఈ రోజు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో తలపడనున్నది.
IPL 2020: తొలి మ్యాచ్‌లో ఎవ్వరూ ఊహించని విధంగా అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించి.. చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్ రాజస్తాన్ ఈ రోజు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో తలపడనున్నది. ఈ హోరాహోరీ పోరుకు షార్జా గ్రౌండ్ వేదిక కానున్నది. అండర్ డాగ్స్‌గా టోర్నీలోకి బరిలోకి దిగిన ఈ రెండు జట్లు తమ జైత్రయాత్రను కొనసాగించాలని ఉవ్విళ్ళూరుతున్నాయి.
రాజస్థాన్, పంజాబ్ ల బలబలాలు:
రాజస్థాన్ గత మ్యాచ్‌లో అందుబాటులో లేని బట్లర్.. ఈ మ్యాచ్ డెవిడ్ మిల్లర్ స్థానంలో బరిలో దిగనున్నారు. దీంతో ఆ టీం బలబలాలు మరింత పెరుగునున్నది. ఆ మ్యాచ్‌లో కెప్టెన్ స్టీవ్ స్మిత్ యాంకర్ రోల్ పోషించనున్నారు. మరోసారి యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగితే పరుగుల సునామీ సృష్టించడం ఖాయం. ఇక చివర్లో జోఫ్రా ఆర్చర్ సిక్సర్ల జల్లు కురిపించాడు. ఇప్పుడు వీళ్లకు జోస్ బట్లర్ కూడా తోడవ్వడం రాయల్స్‌కు మరింత బలాన్ని చేకూరుస్తోంది. టాప్ ఆర్డర్‌లో బట్లర్, స్టీవ్ స్మిత్, శాంసన్.. మిడిల్ ఆర్డర్‌లో రాబిన్ ఉతప్ప నిలబడితే వారి పరుగుల ప్రవాహాన్ని కట్టడి చేయడం ఏ బౌలర్ కు సాధ్యం కాదు.
రాయల్స్ మాదిరిగా పంజాబ్ జట్టుకు కూడా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. గత మ్యాచ్ లో కెప్టెన్ కెఎల్ రాహుల్ రికార్డు సెంచరీ చేసి.. తన టీంను ఒంటి చేతితో గెలిచారు. ఈ టీంలో మయాంక్ అగర్వాల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్ లో నికోలస్ స్థానంలో క్రిస్ గెల్స్‌ను టీంలోకి తీసుకోనున్నారు. ఒక వేళ గేల్ వస్తే.. పరుగల సునామీ సృష్టించడం ఖాయం. ఎందుకంటే .. ఈ స్టేడియం చాలా చిన్నది. అలాగే గేల్ లెగ్ స్పీనర్ పై అద్భుతంగా చెలారేగే అవకాశం ఉంది.
షమీ, కాట్రెల్‌తో పంజాబ్ పేస్ బలంగా ఉండగా.. రవి బిష్ణోయ్, మురుగన్ అశ్విన్, మాక్స్‌వెల్‌తో స్పిన్ విభాగం కూడా అద్భుతంగా ఉంది. ఇక రాజస్థాన్ పేస్ విభాగంలో జోఫ్రా ఆర్చర్ ఆదరగోడుతున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేస్తున్నాడు. ఉనద్కట్, టామ్ కరన్ కూడా ఫామ్‌లోకి వస్తే రాయల్స్‌కు కలిసొచ్చే అంశం.