IPL 2020: బెంగుళూర్ వర్సెస్ ఢిల్లీ .. గెలుపెవరిదీ?
IPL 2020: ఐపీఎల్ 2020 సీజన్‌లో నేడు ( సోమవారం) మరో రసవత్తరమైన పోరు జరుగనున్నది. దుబాయి వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు హోరా హోరీగా తలపడనున్నాయి
IPL 2020: ఐపీఎల్ 2020 సీజన్‌లో నేడు ( సోమవారం) మరో రసవత్తరమైన పోరు జరుగనున్నది. దుబాయి వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు హోరా హోరీగా తలపడనున్నాయి. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులు .. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్‌లాడిన ఇరు జట్ల తలా మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో వరుసగా రెండు , మూడు స్థానాల్లో నిలిచాయి. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండడంతో అభిమానులకు కావాల్సిన మజా లభించనుంది. బలబలాల పరంగా పేపర్‌పై ఇరు జట్లు సమతూకంగా ఉన్నప్పటికీ బౌలింగ్ దృష్ట్యా ఢిల్లీ క్యాపిటల్స్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది.
ఈ సీజన్ ప్రారంభం నుంచి ఢిల్లీ కెప్టెన్ అయ్యర్ చాలా మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. కేకేఆర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి జట్టుకు గెలుపు అందించాడు. అలాగే .. పృథ్వీ షా, రిషభ్ పంత్ ఫామ్‌లోనే ఉన్నారు. శిఖర్ ధావన్ మెరుపులు మెరిపిస్తున్నా.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. హెట్‌మెయిర్,స్టోయినిస్ మరింత రాణించాల్సి ఉంది. ఇవి తప్ప ఢిల్లీకి బ్యాటింగ్‌లో పెద్దగా సమస్యల్లేవు.
ఢిల్లీ బౌలింగ్ విభాగంగా చాలా పటిష్టంగా ఉంది. సూపర్ ఓవర్ స్పెషలిస్ట్ కగిసో రబడా ఢిల్లీ ప్రధాన ఆయుధం. అలాగే నోర్జ్ కూడా చాలా మంచి బౌలింగ్‌తో సత్తా చాటుతున్నాడు. మరో బౌలర్ హర్షల్ పటేల్ కూడా అదరగొడుతున్నాడు. కేకేఆర్‌పై జరిగిన గత మ్యాచ్ లో మంచి ప్రదర్శన కనబరిచాడు. తొలి మ్యాచ్‌లో గాయం కారణంగా దూరమైన ఆశ్విన్ .. కోలుకోని జట్టులోకి రావొచ్చునని సమాచారం. అశ్విన్ తుది జట్టులోకి వస్తే.. ఆ జట్టు బలాన్ని మరింత చేకూరుతుంది. మరోవైపు అమిత్ మిశ్రా కీలకం కానున్నాడు.
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చారు. అద్భుతంగా రాణించి.. హాఫ్ సెంచరీ. ఇక యువ ఓపెనర్ దేవదూత్ పడిక్కల్ ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలు సాధించి దూకుడు మీదున్నాడు. ఫించ్, డిలిలియర్స్ సత్తా చాటుతున్నారు. టాపార్డర్‌లో ఏ ఇద్దరు చెలరేగిన ఆర్‌సీబీకి తిరుగుండదు. బౌలింగ్‌లో యుజ్వేంద్ర చాహల్ టాప్ ఫామ్‌లో ఉండగా.. ఉడానా, సైనీ వాషింగ్టన్ సుందర్, జంపా తదితరులతో లైనప్ బలంగా కనిపిస్తోంది. కానీ డెత్ ఓవర్లలోనే బౌలర్లు తేలిపోవడం జట్టు కలవరపెడుతుంది. అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్న ఉడానా.. డెత్ ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోతున్నాడు. సైనీ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. గాయం నుంచి క్రిస్ మోర్రిస్ కోలుకోవడంతో తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అతను జట్టులోకి వస్తే జంపా బెంచ్‌కే పరిమితమవుతాడు.