IPL 2020: ఇదే ఫైనల్ వార్నింగ్: అశ్విన్

IPL 2020: క్రికెట్ ఇస్ ఏ ఫ‌న్నీ గేమ్‌.. ప్ర‌తి ఆట‌గాడు త‌న‌దైన‌ వైవిధ్య‌మైన ప్ర‌ద‌ర్శ‌నతో ఆక‌ట్టు కుంటారు. ఐపీఎల్ లో.. ఇలాంటి వైవిధ్య ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు కొద‌వేలేదు బ్యాటింగ్ లోనూ, బౌలింగ్‌లోనూ . కానీ కొన్ని క్రీడా స్పూర్తికి విరుద్ధం ఉంటాయి.

Update: 2020-10-06 07:29 GMT

IPL 2020: ఇదే ఫైనల్ వార్నింగ్: అశ్విన్

IPL 2020: క్రికెట్ ఇస్ ఏ ఫ‌న్నీ గేమ్‌.. ప్ర‌తి ఆట‌గాడు త‌న‌దైన‌ వైవిధ్య‌మైన ప్ర‌ద‌ర్శ‌నతో ఆక‌ట్టు కుంటారు. ఐపీఎల్ లో.. ఇలాంటి వైవిధ్య ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు కొద‌వేలేదు బ్యాటింగ్ లోనూ, బౌలింగ్‌లోనూ . కానీ కొన్ని క్రీడా స్పూర్తికి విరుద్ధం ఉంటాయి. ఈ కోవ‌కు చెందిందే.. మన్కడింగ్. ఈ పేరు చెప్ప‌గానే గుర్తు వ‌చ్చేంది రవిచంద్రన్ అశ్విన్.

అశ్విన్ బౌలింగ్‌కు దిగాడంటే.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ కుదురుగా క్రీజ్‌లో ఉండాల్సిన పరిస్థితిని కల్పించింది. ఈ సీజన్ మొత్తానికీ అశ్విన్ బౌలింగ్‌కు దిగుతున్నాడంటే నాన్ స్ట్రైకింగ్ ఎండ్ బ్యాట్స్‌మెన్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే. గతరాత్రి బెంగళూరుతో తలపడిన మ్యాచ్‌లో అశ్విన్‌ మన్కడింగ్‌ చేసే అవకాశం ఉన్నా బెంగళూరు బ్యాట్స్‌మన్‌ ఆరోన్‌ ఫించ్‌ను వదిలేసిన సంగతి తెలిసిందే.

గతేడాది లీగ్‌లో రాజస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ను అతడు ఇదే విధంగా ఔట్‌ చేయగా పెద్ద దుమారం రేగింది. అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పలువురు క్రికెటర్లు అతడిపై తీవ్ర విమర్శలు చేశారు. అయినా అశ్విన్‌ అవేమీ పట్టించుకోకుండా ఆట నియమాలకు లోబడే ప్రవర్తించానని అంతే దీటుగా సమాధానమిచ్చాడు. మరోవైపు ఈ సీజన్‌ మొదలవ్వకముందే మన్కడింగ్‌ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.

ఢిల్లీ కోచ్‌ రికీ పాంటింగ్‌ టోర్నీ ఆరంభానికి ముందే ఈ విషయంపై అశ్విన్‌తో చర్చిస్తానని, ఈ సీజన్‌లో తమ ఆటగాళ్లెవరూ అలా చేయడానికి వీలు లేదని చెప్పాడు. అన్నట్లుగానే పాంటింగ్‌ అశ్విన్‌తో చర్చించాడు. అయితే, వారి మధ్య చర్చ ఎలా కొలిక్కి వచ్చిందో స్పష్టత లేనప్పటికీ.. తాజా మ్యాచ్‌లో అశ్విన్‌.. ఫించ్‌ను వదిలేయడం విశేషం. మరోవైపు ఇదే అంశంపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున జోకులు పేలాయి. కాగా, మ్యాచ్‌ అనంతరం అశ్విన్‌ ఓ ట్వీట్‌ చేసి అందరికీ గట్టి హెచ్చరిక జారీ చేశాడు. 2020లో ఇదే ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ వార్నింగ్‌ అని పేర్కొన్నాడు. 

Tags:    

Similar News