IPL 2020: మయాంక్ మెరుపులు.. పంజాబ్ రికార్డు స్కోర్
IPL 2020: ఐపీఎల్ లో షార్జా వేదికగా నేడు రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ వచ్చింది.
IPL 2020: ఐపీఎల్ లో షార్జా వేదికగా నేడు రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ వచ్చింది. ఓపెనర్లుగా వచ్చిన కెఎల్ రాహుల్ , మయంక్ లు తమ అద్భుతమైన ఆటతీరుతో.. రికార్డు భాగస్వామ్య పరుగులు చేశారు. బ్యాట్ మెన్స్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. మయాంక్ ప్రత్యర్థి బౌలర్లను చీల్చీ చెండాడాడు. కేవలం 50 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సులతో 106 మెరుపు సెంచరీ చేశాడు. ఒకరకంగా చెప్పాలంటే పంజాబ్ బౌలర్లను ఊచకోతకోశాడని చెప్పాలి.
ఇదే తరహాలో కెప్టెన్ కెఎల్ రాహుల్ కూడా అదరగొట్టారు. 54 బంతుల్లో 69 పరుగులు చేశారు. ఏ బౌలర్‌ను కూడా వదిలిపెట్టలేదు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఈ సీజన్‌లో అత్యధిక ఫస్ట్ వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరూ కలసి ఫస్ట్ వికెట్‌కు 183 రన్స్ చేశారు. చివరకు 17వ ఓవర్లో టామ్ కరణ్ వారిద్దరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. తర్వాత అంకిత్ రాజ్‌పుత్ వేసిన 18వ ఓవర్లో చివరి బంతికి ఔట్ అయ్యాడు. ధర్డ్ మ్యాన్ బౌండరి దిశగా కేఎల్ రాహుల్ కొట్టిన బంతి గాల్లోకి లేచి శ్రేయాల్ గోపాల్ చేతిలో పడింది.
చివర్లో మ్యాక్స్‌వెల్, పూరన్ కూడా రాజస్థాన్ బౌలర్లను వదిలిపెట్టలేదు. 19వ ఓవర్లో చివరి బంతికి పూరన్ బంతిని గాల్లోకి లేపాడు. అయితే, అద్భుతమైన క్యాచ్‌ను వదిలిపెట్టాడు ఊతప్ప. ఆ తర్వాత పూరన్ రెచ్చిపోయాడు. ఆర్చర్ వేసిన 20వ ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు పూరన్. పూరన్ ఎంతలా చెలరేగాడంటే కేవలం 8 బంతుల్లో 25 పరుగులు చేశాడు. అందులో 1 ఫోర్, 3 సిక్స్‌లు ఉన్నాయి. మ్యాక్స్‌వెల్ కూడా 9 బాల్స్‌లో 13 రన్స్ చేశాడు. దీంతో పంజాబ్ జట్టు 223 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ భారీ స్కోర్‌ను రాజస్థాన్ ఏవి ధంగా పూర్తి చేస్తుందో చూడాలి