IPL 2020: రాజస్థాన్ రాయల్స్ కు పెద్ద షాక్.. బెన్ స్టోక్స్ దూరం!
IPL 2020: ఇంకో మూడురోజుల్లో యూఏఈ వేదికగా ఐపీఎల్2020 ప్రారంభం కానున్నది. కానీ ఆయా జట్లలో కీలక ఆటగాళ్ల చేరికపై ఇంకా అనుమానులు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఈ సీజన్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.

స్టోక్స్ ఈ సీజన్‌లో ఆడటం అనుమానమేనని ఆ జట్టు కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ అన్నారు. గత ఏడాది ఇంగ్లాండ్‌కు వన్డే ప్రపంచ కప్ అందించడంలో కీలకపాత్ర పోషించిన స్టోక్స్.. ఆగస్టులో పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్టు ముందు జట్టు నుంచి వైదొలగాడు. న్యూజీలాండ్‌లో ఉంటున్న తన కుటుంబ సభ్యుల దగ్గరకు స్టోక్స్ వెళ్లిపోయాడు. స్టోక్స్ తండ్రి ప్రస్తుతం బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు సమాచారం.
'మేం ఆలోచించేది స్టోక్స్ కుటుంబం గురించే.. వాళ్లిపుడు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే మేం స్టోక్స్ వెంటే ఉండాలనుకుంటున్నాం. ఆడే విషయం, ఈ సీజన్‌కు అందుబాటులో ఉండే అంశం అతనికే వదిలేశాం. కావాల్సినంత సమయం ఇచ్చాం. అయితే ఇప్పుడే ఆడేది లేనిది కచ్చితంగా చెప్పలేం" అని కోచ్ మెక్‌డొనాల్డ్ వెల్లడించారు.
గత ఏడాది క్రిస్మస్‌కు రెండు రోజుల ముందు జొహన్నెస్‌బర్గ్‌లో తీవ్ర అస్వస్థతతో స్టోక్స్ తండ్రి జెడ్ ఆసుపత్రిలో చేరారు. అప్పుడే ఆయన క్యాన్సర్ గురించి తెలిసింది. జెడ్ స్టోక్స్ న్యూజీలాండ్ రగ్బీ జట్టు మాజీ ఆటగాడు.