IPL 2020: కేకేఆర్ అభిమానులకు శుభవార్త.. సునీల్ నరైన్ కు గ్రీన్ సిగ్నల్
IPL 2020: కోల్‌కతా నైట్ రైడర్స్ అభిమానులకు శుభవార్త. అవునండీ.. అనుమానాస్పద బౌలింగ్ శైలితో వివాదంలో ఉన్న నరైన్‌కు ఐపీఎల్ బౌలింగ్ యాక్షన్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
IPL 2020: కోల్‌కతా నైట్ రైడర్స్ అభిమానులకు శుభవార్త. అవునండీ.. అనుమానాస్పద బౌలింగ్ శైలితో వివాదంలో ఉన్న నరైన్‌కు ఐపీఎల్ బౌలింగ్ యాక్షన్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వార్నింగ్ లిస్ట్ (హెచ్చరిక జాబితా) నుంచి అతడి పేరును తొలగించింది. సునీల్ నరైన్‌ను వార్నింగ్ లిస్ట్‌లో పెట్టడంతో అతన్ని రెండు మ్యాచ్ లో టీం పక్కన బెట్టింది. నేడు అతనికి బౌలింగ్ యాక్షన్ కమిటీ నుంచి క్లియరెన్స్ రావడంతో .. రానున్న మ్యాచ్‌ల్లో తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశముంది.
ఈ నెల 9న జరిగిన పంజాబ్, కోల్‌కతా మ్యాచ్‌లో సునీల్ నరైన్ బౌలింగ్ శైలిపై ఫీల్డ్ ఎంపైర్లు అనుమానం వ్యక్తం చేశారు. అతడి బౌలింగ్ యాక్షన్ తేడాగా ఉందని ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గఫనీ, ఉల్లాస్ గాంధీ బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో బీసీసీఐ సునీల్ నరైన్‌ను వార్నింగ్ లిస్ట్ లో పెట్టింది. నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై మరోసారి ఫిర్యాదు వస్తే.. ఈ ఐపీఎల్ టోర్నీలో బౌలింగ్ చేయకుండా సస్పెండ్ చేస్తామని బీసీసీఐ గత ఆదివారం తెలిపింది. నేడు నరైన్‌కు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేకేఆర్ జట్టుకు బలం చేకూరింది.