IPL 2020: ధోని ఓ జీనియస్: సామ్ కరన్
IPL 2020: ముంబయి ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్ రివెంజ్ తీర్చుకుంది. గతేడాది ఐపీఎల్ ఫైనల్‌లో ముంబయి చేతితో ఓటమి పాలైన చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సీజన్ ఆరంభ పోరులోనే ఛాంపియన్ ముంబయికి గట్టి షాకిచ్చింది
IPL 2020: ముంబయి ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్ రివెంజ్ తీర్చుకుంది. గతేడాది ఐపీఎల్ ఫైనల్‌లో ముంబయి చేతితో ఓటమి పాలైన చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సీజన్ ఆరంభ పోరులోనే ఛాంపియన్ ముంబయికి గట్టి షాకిచ్చింది. మిగితా జట్లకూ ముందస్తు హెచ్చరిక చేసింది. శనివారం అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్ లో చెన్నై విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ దిగినా.. ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన చెన్నై.. చాలా కూల్‌గా ఆడి విజేతగా నిలిచింది. ఇందులో అంబటి రాయుడు తనదైనా బాదుడుతో 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 71 పరుగులు చేశాడు, ఫాఫ్ డుప్లెసిస్ కూడా మెరుపు షాక్ తో అలరించారు. 44 బంతుల్లో 6 ఫోర్లతో 58 పరుగులు చేసి నాటౌట్ నిలిచాడు. ఎవ్వరూ ఊహించని విధంగా ఆరో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన శ్యామ్ కరాన్ 6 బంతుల్లోనే 18 పరుగులు చేసి చెన్నై గెలుపుకు మార్గం సుగమం చేశాడు. దీంతో చెన్నై 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ధోని జీనియస్
చెన్నై విజయం అనంతరం సామ్ కరన్ మాట్లాడుతూ.. ఈ ఐపీఎల్‌లో ధోనీతో ఆడుతాననే ఆలోచన నాలో కొత్త ఉత్సాహం నింపింది. నిజం చెప్పాలంటే.. నేను ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తానని తెలియదు. కెప్టెన్ ధోనీ 18 ఓవర్‌లో నా వద్దకు వచ్చి.. జడేజా తర్వాత నువ్వే బ్యాటింగ్ చేయాలి. రెడీగా ఉండు. రిస్క్ తీసుకొని ఆడు.. ఏదైతే అది జరుగుతుంది. నీ ఆట నువ్వు ఆడు. మనకు పరుగులు కావాలి" అని చెప్పాడు. నేను అది అస్సలు ఊహించలేదు. ధోని బాయి ఆ నిర్ణయంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను.
లెఫ్ట్.. రైట్ కాంబినేషన్‌ను దృష్టిలో ఉంచుకొనే ధోని ఆ నిర్ణయం తీసుకున్నాడు. నిజంగా ఆయన ఫ్లాన్ అదుర్స్ . ఆయన నిజంగా జీనియస్. కృనాల్ పాండ్యా వేసిన 18వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాది జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడం సంతోషంగా ఉంది. రాయుడు, డుప్లెసిస్‌లు అద్భుతంగా ఆడారు. జట్టు విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది' అని సామ్ కరన్ పేర్కొన్నాడు.