IPL 2020: కేకేఆర్ కొత్త కెప్టెన్ గా మోర్గాన్
IPL 2020: : కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తీక్ పై వేటు పడింది. కార్తీక్‌ను కేకేఆర్ కెప్టెన్సీ నుంచి తొలగించి, ఇంగ్లాండ్ ఆటగాడు ఇయాన్ మోర్గాన్‌కు ఆ బాధ్యతలు అప్పగినట్టు తెలుస్తుంది
IPL 2020: కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తీక్ పై వేటు పడింది. కార్తీక్‌ను కేకేఆర్ కెప్టెన్సీ నుంచి తొలగించి, ఇంగ్లాండ్ ఆటగాడు ఇయాన్ మోర్గాన్‌కు ఆ బాధ్యతలు అప్పగినట్టు తెలుస్తుంది. దీంతో నేటి నుంచి కేకేఆర్ కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్ వ్యవహరించనున్నాడు. దీనేష్ కార్తీక్ పై కేకేఆర్ మెనేజ్ మెంట్ ఆసహానమే కారణమని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే.. దినేష్ కార్తీక్ మాత్రం .. బ్యాటింగ్‌పై ఫోకస్ చేసేందుకు తాను కెప్టెన్సీని వదులుకుంటున్నానని చెబుతున్నాడు. అందుకోసమే ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడని కార్తీక్ తెలిపాడు. వాస్తవానికి దినేష్ కార్తీక్ మాత్రం అనుకున్న స్తాయితో రాణించలేక పోయారు. దినేష్ కార్తీక్ 37 మ్యాచ్‌లకు సారథ్య వహించిన అందులో ..19 మ్యాచులో విజయం సాధించగా, 17 మ్యాచుల్లో ఓటమి చవిచూశారు. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. తనకు కెప్టెన్సీ అదనం భారంగా మారినట్టు కేకేఆర్ మేనేజ్‌మెంట్‌కు కార్తీక్ వివరించాడు ఈ నేపథ్యంలో ఇయాన్ మోర్గాన్‌కు కేకేఆర్ కెప్టెన్సీ అప్పగించినట్లు సమాచారం.
ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 7 మ్యాచ్‌లాడిన కేకేఆర్ 4 మ్యాచ్‌లలో నెగ్గి, 3 మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. ఐపీఎల్ 2020 సరిగ్గా సగం మ్యాచ్‌ల తర్వాత సారథ్య బాధ్యతలపై కేకేఆర్ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.ఐపీఎల్‌లో ప్రస్తుతం మూడు జట్లకు విదేశీ కెప్టెన్లు ఉన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు డేవిడ్ వార్నర్, రాజస్థాన్ రాయల్స్‌కు స్టీవ్ స్మిత్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.