IPL 2020, MI vs KXIP: తొలుత తడబడ్డ.. పొలార్డ్, డికాక్ ల విజృంభనతో ముంబై భారీ స్కోర్
IPL 2020, MI vs KXIP: ఐపీఎల్ 2020లో ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ , కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. తొలుత తడబడ్డ.. తరువాత తెరుకుని 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది
IPL 2020, MI vs KXIP: ఐపీఎల్ 2020లో ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ , కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. తొలుత తడబడ్డ.. తరువాత తెరుకుని 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ తనదైన ఆటతీరుతో మరోసారి అదరగొట్టాడు. వరుసగా రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. 43 బంతుల్లో 53 పరుగులు జట్టు భారీ స్కోర్ చేయడంలో తన భాగస్వామ్యాన్ని అందిచాడు. ఈ మ్యాచ్ లో డికాక్ మినహా ఇతర టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. రోహిత్ శర్మ 9, సూర్యకుమార్ యాదవ్ డౌకౌట్, ఇషాన్ కిషన్ 7, హార్దిక్ పాండ్యా 8 పరుగులకే ఫెవిలియన్ చేరాడు.
కృనాల్ పాండ్యా తన అత్యుతమైన స్ట్రైకింగ్ తో 34 పరుగులు చేశాడు. చివరగా వచ్చిన పొలార్డ్ మరో సారి విజృంభించాడు. ప్రతి బంతిని బౌండరీకి తరలించే ప్రయత్నం చేశాడు. తన విధ్వంసకర ఇన్నింగ్స్ తో కేవలం 12 బంతుల్లో 34 పరుగులు చేశాడు, పొలార్డ్ క తోడుగా కౌంటర్‌నైల్ 12 బంతుల్లో 24 పరుగులతో మెరుపులు మెరిపించారు. సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. దాంతో ముంబై స్కోర్ 164కి చేరింది. పంజాబ్ బౌలర్లలో మహమ్మద్ షమి, అర్షదీప్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. క్రిస్ జోర్డాన్, రవి బిష్ణోయ్‌కు చెరో వికెట్ దక్కింది.ఈ లక్ష్యాని పంజాబ్ బ్యాట్స్ మెన్స్ చేధించేనా వేచి చూడాలి.