IPL 2020 : రోమాంచిత మ్యాచ్.. పంజాబ్ వీరోచిత విజయం!!
IPL 2020: ఐపీఎల్ చరిత్రలో మునుపెన్నడూ చూడని ఓ ఉత్కంఠ పోరు జరిగింది. ఐపీఎల్ అభిమానులకు అసలూ సిసలైన వినోదాన్ని అందించింది . ఏ మ్యాచ్‌లో కనివినీ రీతిలో .. ట్విస్ట్‌లు...సర్‌ప్రైజ్‌లు ఈ మ్యాచ్‌లో జరిగాయి
IPL 2020: ఐపీఎల్ చరిత్రలో మునుపెన్నడూ చూడని ఓ ఉత్కంఠ పోరు జరిగింది. ఐపీఎల్ అభిమానులకు అసలూ సిసలైన వినోదాన్ని అందించింది . ఏ మ్యాచ్‌లో కనివినీ రీతిలో .. ట్విస్ట్‌లు...సర్‌ప్రైజ్‌లు ఈ మ్యాచ్‌లో జరిగాయి.ఐపీఎల్ ఈ సండేను ..సూపర్.. సూపర్.. సూపర్ సండేగా మార్చేసింది. సన్‌రైజర్స్, కోల్‌కత్తాల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో .. సూపర్ ఓవర్‌లో ఫలితం తేలిన విషయం తెలిసింది.
అనంతరం దుబాయి వేదికగా ముంబాయి, కింగ్స్ లెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ అంతకు మించి అన్నట్టుగా సాగింది. కింగ్స్ తరహా పోరాటం.. పేరును సార్ధకం చేసుకున్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్. ఐపీఎల్ లాంటి టోర్నీలో ఊపు మీద ఉన్న ముంబయి పై పట్టువదలని పోరాటం చేసిన రాహుల్ సేన దుబాయ్ లో కింగ్ గా నిలిచింది. ఒక్కో బంతి కీ విజయం దోబూచులాడుతోంటే.. ఉత్కంఠ పెరిగిపోతుంటే.. నరాలు తెగేలా పరిస్థితి మారుతుంటే.. కింగ్స్ ఎలెవెన్ ఆటగాళ్ళు అద్భుత ఆటతీరుతో విజయం సాధించి ఆదివారం అసలైన ఐపీఎల్ మజాను అభిమానులకు ఇచ్చారు. మ్యాచ్ టై అయిందని సూపర్ ఓవర్ పెడితే.. సూపర్ ఓవర్ కూడా టై అయింది. ఐపీఎల్‌లో చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.
తొలి సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కేవలం 5 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. పంజాబ్ బ్యాట్స్ మెన్స్‌ను కట్టడి చేయడంలో బుమ్రా సఫలమాయ్యడనే చెప్పాలి. కేఎల్ రాహుల్ నాలుగు బంతుల్లో నాలుగు పరుగులు చేసి ఔటయ్యాడు. పూరన్ ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్కు చేరాడు.
అనంతరం ముంబై ఇండియన్స్ తరుపున డికాక్, రోహిత్ క్రీజులోకి వచ్చారు. పంజాబ్ బౌలర్ మహమ్మద్ షమి సూపర్ ఓవర్ వేశాడు. మొదటి మూడు బంతులకు మూడు సింగిల్స్ మాత్రమే వచ్చాయి. నాలుగో బంతిని రోహిత్ శర్మ బీట్ చేశాడు. ఐదో బంతికి సింగిల్ మాత్రమే వచ్చింది. ఆఖరి బంతికి 2 పరుగులు కావాల్సిన సమయంలో...డికాక్ ఒక రన్ తీశాడు. రెండో పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. దీంతో సూపర్ ఓవర్‌కే సూపర్ ఓవర్ వేయాల్సి వచ్చింది.
రెండో సూపర్ ఓవర్‌లో తొలుత ముంబాయి బ్యాటింగ్ కు వచ్చింది. ముంబాయి బ్యాట్స్ మెన్స్‌ను కట్టడి చేయడానికి జోర్డాన్ వచ్చాడు. మొదటి బంతికి.. పొలార్డ్ సింగిల్ తీశాడు. రెండో బంతి వైడ్ వెళ్లింది. ఆ తర్వాత బంతిని పాండ్యా సింగిల్ తీశాడు. మూడో బాల్‌ను పొలార్డ్ ఫోర్ కొట్టాడు. నాలుగో బంతి వైడ్ వెళ్లింది. ఆ తర్వాతి బంతికి పాండ్యా రనౌట్ అయ్యాడు. ఐదో బంతిని పొలార్డ్ బీట్ చేశాడు. ఆరో బంతికి రెండు పరుగులు వచ్చాయి. బౌండరీ లైన్ వద్ద మయాంగ్ అగర్వాల్ అద్భుతంగా ఫిల్డింగ్ చేసి.. సిక్స్‌ని ఆపాడు. దీంతో ముంబాయికు 11 పరుగులు వచ్చాయి.
అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన పంజాబ్ బ్యాట్స్‌మెన్.. గేల్, మయాంక్ అగర్వాల్ లు విధ్వంసం సృష్టించారు. బౌల్ట్ వేసిన మొదటి బంతిని క్రిస్ గేల్ ఎవ్వరూ ఊహించి విధంగా భారీ హిట్టింగ్ చేసి అద్భుతంగా సిక్స్ గా మలిచాడు. రెండో బంతికి సింగిల్ వచ్చింది. మూడు, నాలుగు బంతుల్లో మయాంగ్ అగర్వాల్ వరుస ఫోర్లు కొట్టడంతో పంజాబ్ జట్టు అత్యంత థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. పంజాబ్ జట్టు గెలిచింది. ఈ గెలుపుతో రెండు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరింది.
అంతుకు ముందు 176 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ చేధించలేకపోయింది. 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 176 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. దాంతో ఫలితం కోసం సూపర్ ఓవర్‌కు వెళ్లారు. ఈ టోర్నీలో మ్యాచ్ టై కావడం ఇది నాలుగోసారి. ఇంతకు ముందు జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ కూడా టై కావడంతో.. సూపర్ ఓవర్ ద్వారా ఫలితం ప్రకటించారు.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట్స్‌మెన్‌లో కేఎల్ రాహుల్ మరోసారి అదరగొట్టాడు. తన అద్బుతమైన బ్యాటింగ్ తీరుతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. 51 బంతుల్లో 77 పరుగులు చేశాడు. క్రిస్ గేల్ 24, నికోలస్ పూరన్ 24 రన్స్ చేసి పరవా లేదనిపించారు. మయాంక్ అగర్వాల్ (14), మాక్స్‌వెల్ (0) విఫలమయ్యారు. కేఎల్ రాహుల్ దూకుడుతో పంజాబ్ జట్టు ఈజీగా విజయం సాధిస్తుందనుకున్న సమయంలో.. బుమ్రా మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. మంచి జోరులో ఉన్న కేఎల్ రాహుల్‌ను 18వ ఓవర్లో క్లీన్ బౌల్డ్ చేశాడు. కేఎల్ రాహుల్ వికెట్ పడడంతో దెబ్బకు సీన్ మారింది. ఐతే ఆ తర్వాత దీపక్ హుడా, జోర్డాన్ ఆచితూచి ఆడుతూ..బంతులను బౌండరీలకు తరలించారు.
ఐతే చివరి ఓవర్‌లో 9 పరుగులు కావాల్సిన వేళ.. బంతిని బోల్ట్ చేతికి ఇచ్చాడు రోహిత్. మొదటి బంతికి దీపక్ హుడా సింగిల్ తీశాడు. రెండో బంతిని బౌండరీకి పంపిన జోర్డాన్.. మూడో బంతికి సింగిల్ తీశాడు. నాలుగో బంతిని దీపక్ హుడా బీట్ చేశాడు. ఐదో బంతికి సింగిల్ తీశాడు. చివరి బంతికి రెండుపరుగులు కావాల్సిన సమయంలో.. జోర్డాన్ సింగిల్ మాత్రమే తీశాడు. రెండో పరుగుకు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. దాంతో మ్యాచ్ టై అయింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ మరోసారి అదరగొట్టాడు. 43 బంతుల్లో 53 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. డికాక్ మినహా ఇతర టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. రోహిత్ శర్మ 9, సూర్యకుమార్ యాదవ్ 0, ఇషాన్ కిషన్ 7, హార్దిక్ పాండ్యా 8 పరుగులు మాత్రమే చేశారు. మిడిల్ ఆర్డర్లో వచ్చిన కృనాల్ పాండ్యా 34 పరుగులు చేశాడు. ఆఖరులో పొలార్డ్ 12 బంతుల్లో 34, కౌంటర్‌నైల్ 12 బంతుల్లో 24 మెరుపులు మెరిపించారు. దాంతో ముంబై స్కోర్ 164కి చేరింది. పంజాబ్ బౌలర్లలో మహమ్మద్ షమి, అర్షదీప్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. క్రిస్ జోర్డాన్, రవి బిష్ణోయ్‌కు చెరో వికెట్ దక్కింది.