IPL 2020 Match 11 Updates: హైదరాబాద్ ను కట్టడి చేసిన ఢిల్లీ బౌలర్లు.. కాపిటల్స్ విజయ లక్ష్యం 163

IPL 2020 Match 11Updates: ఢిల్లీ కాపిటల్స్..సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 టోర్నీలో 11 మ్యాచ్ లో ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌల్ చేయడంతో సన్రైజర్స్ జట్టు 162 పరుగులు చేయగలిగింది.

Update: 2020-09-29 16:11 GMT

హ్యాట్రిక్ కొట్టాలని ఓ జట్టు.. ఆడిన రెండు మ్యచుల్లోనూ ఓటమి పాలై ఎలాగైనా మొదటి విజయం సాధించాలని మరో జట్టు పోరుకు సిద్ధమయ్యాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ.. అట్టడుగు స్థానంలో ఉన్న హైదరాబాద్‌.. ఈ రెండు జట్ల మధ్య నేడు అబుదాబీ వేదికగా ఐపీఎల్ 2020 లో 11 వ మ్యాచ్‌ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ హైదరాబాద్ కు బ్యాటింగ్ అప్పచెప్పాడు. నిదానంగా హైదరాబాద్ బ్యాటింగ్ ప్రారంభం అయింది. ఓపెనర్లు ఇద్దరూ ఆచి తూచి ఆడారు. దీంతో మొదటి ఐదు ఒవర్లకూ 24 పరుగులు చేసింది హైదరబాద్. బెయిర్ స్టో నిదానంగా ఆడుతుంటే వార్నర్ గట్టిగా పరుగులు చేసే ప్రయత్నం చేశాడు. అయితే, 45 పరుగులు చేసి 10 వ ఓవర్ లో వార్నర్ క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేరాడు. తరువాత వచ్చిన మనీష్ పాండే 3 పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో 12 ఓవర్లకు రెండు వికెట్లకు 94 పరుగులు చేసింది హైదరాబాద్ జట్టు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన విలియంసన్.. బెయిర్ స్టా తో కలిసి ఇన్నింగ్స్ వేగం పెంచే ప్రయత్నం చేశాడు. కొన్ని మెరుపులూ మెరిపించాడు. మరో వైపు బెయిర్ స్టా తన అర్థ సెంచరీ పూర్తీ చేసుకున్నాడు. వెంటనే భారీ షాట్ కొత్తబోయి అవుట్ అయ్యాడు. చివర్లో 26 బంతుల్లో 41 పరుగులు చేసిన విలియంసన్ అవుట్ అయ్యాడు. దీంతో హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు నాలుగు వికెట్లకు 162 పరుగులు చేయగలిగింది.

హైదరాబాద్ బ్యాటింగ్ సాగింది ఇలా..

* ఇషాంత్‌ వేసిన తొలి ఓవర్‌లో హైదరాబాద్‌ 9 పరుగులు రాబట్టింది. .

* రబాడ వేసిన రెండో ఓవర్‌లో వార్నర్‌ తొలి బౌండరీ కొట్టడంతో రెండు ఓవర్లకు హైదరాబాద్‌ స్కోర్‌ 14/0 చేరింది.

* ఇషాంత్‌ శర్మ వేసిన మూడో ఓవర్‌లో, అన్‌రిచ్‌ నోర్జే వేసిన నాలుగో ఓవర్‌లో హైదరాబాద్‌ మూడేసి పరుగులు మాత్రమే చేయగలిగింది.

* 5 ఓవర్లు పూర్తయ్యేసరికి హైదరాబాద్‌ 24 పరుగులు చేసింది.

* నోర్జే వేసిన ఆరో ఓవర్‌ నాలుగో బంతికి వార్నర్ తొలి సిక్స్‌ బాదాడు, తర్వాత ఒక ఫోర్‌, ఒక సింగిల్‌ తీశాడు. ఈ ఓవర్‌లో మొత్తం 14 పరుగులు లభించాయి. 6 ఓవర్లకు హైదరాబాద్‌ స్కోర్‌ 38/0,

* ఊపు మీద ఉన్న వార్నర్ (45)‌ అమిత్ మిశ్రా బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లకు హైదరాబాద్ 82/1

* అమిత్ మిశ్రా బౌలింగ్‌లో మనీష్‌ (3) భారీ షాట్‌కు యత్నించి రబాడ చేతికి చిక్కాడు. 12 ఓవర్లకు హైదరాబాద్ 94/2

* 15 ఓవర్లు పూర్తయ్యేసరికి హైదరాబాద్‌ రెండు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది.

* రబాడ వేసిన 16వ ఓవర్‌లో విలియమ్సన్‌ రెండు ఫోర్లు బాదాడంతో ఆ జట్టు స్కోర్‌ 128/2గా నమోదైంది.

* స్టోయినిస్‌ వేసిన 17వ ఓవర్‌లో విలియమ్సన్‌ మరో రెండు ఫోర్లు బాదడంతో ఈ ఓవర్‌లో మొత్తం 12 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లకు హైదరాబాద్‌ 140/2తో నిలిచింది.

* రబాడ వేసిన 18వ ఓవర్‌లో జానీ బెయిర్‌స్టో(53) తొలుత రెండు పరుగులు తీసి అర్ధశతకం సాధించాడు. తర్వాత భారీ షాట్‌ ఆడబోయి నోర్జే చేతికి చిక్కాడు. దీంతో హైదరాబాద్‌ 144 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. అ

* రబాడ వేసిన 20వ ఓవర్‌లో నాలుగో బంతికి విలియ్సన్‌(41) భారీ షాట్‌ ఆడి బౌండరీ వద్ద అక్షర్‌ పటేల్‌ చేతికి చిక్కాడు. దీంతో హైదరాబాద్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. 

Tags:    

Similar News