IPL 2020 Match 12 Updates : కోల్‌కతా నైట్ రైడర్స్ స్లో బ్యాటింగ్.. రాజస్థాన్ విజయలక్ష్యం 175..
IPL 2020 Match 12 Updates: రాజస్తాన్ రాయల్స్ బౌలర్లు కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్ మెన్ ను నిలువరించారు. దీంతో 174 పరుగులకు పరిమితం అయింది కోల్‌కతా.
రెండు మ్యాచుల్లో విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలని రాజస్థాన్ రాయల్స్ బరిలోకి దిగింది. కోల్‌కతా నైట్ రైడర్స్ తో దుబాయ్ వేదికగా జరుగుతున్నటీ20 లీగ్‌లో 12వ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతాను ఓ మోస్తరు స్కోరుకు కట్టడి చేయడంలో విజయం సాధించారు రాజస్థాన్ బౌలర్లు. ముఖ్యంగా ఆర్చర్ బౌలింగ్ ధాటికి కోల్‌కతా బ్యాట్స్ మెన్ తడబడ్డారు. ఇక మెల్లగా కుడురుకోవడం.. రెండు మూడు మెరుపులు మెరిపించడం..ఔట్ అయి వెళ్ళిపోవడం ఇలా సాగింది కోల్‌కతా బ్యాటింగ్. దీంతో శుభం గిల్ తప్ప ఏ ఒక్క బ్యాట్స్ మెన్ కూడా 40 పరుగులను అందుకోలేక పోయారు. దీంతో నిర్ణేత ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.
కోల్‌కతా బ్యాటింగ్ సాగిందిలా..
* ఆర్చర్ తన తొలి ఓవర్‌లో కేవలం ఒక్క పరుగే ఇచ్చాడు. కోల్‌కతా ఓపెనర్లు గిల్ (1), నరైన్ (0) ఆచితూచి ఆడుతున్నారు. ఓవర్ ముగిసేసరికి కోల్‌కతా 1/0
* అంకిత్ వేసిన 2వ ఓవర్‌లో గిల్ లాంగ్‌ఆన్ మీదుగా సిక్సర్ బాదాడు. ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. 2 ఓవర్లకు కోల్‌కతా 10/0
* ఉనద్కత్ బౌలింగ్‌లో వరుసగా మిడ్‌వికెట్ మీదుగా సిక్సర్, డీప్ ఎక్స్‌ట్రా కవర్ మీదుగా బౌండరీ బాదిన నరైన్ (15) తర్వాతి బంతికి బౌల్డయ్యాడు. దీంతో 5 ఓవర్లకు కోల్‌కతా 36/1 చేసింది.
* పరాగ్ వేసిన 8వ ఓవర్లో తొలి బంతిని నితీశ్ రాణా భారీ సిక్సర్ బాదాడు. 8 ఓవర్లకు కోల్‌కతా 66/1.
* 10 ఓవర్ తెవాతియా బౌలింగ్‌లో మొత్తం 6 పరుగులు వచ్చాయి. చివరి బంతికి రాణా భారీ షాట్‌కు యత్నించి పరాగ్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. 10 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 82/2.
* 12వ ఓవర్‌లో గిల్ (47) ఔటయ్యాడు. జోప్రా బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి రిట్నర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.12 ఓవర్లకు కోల్‌కతా 90/3
* 13వ ఓవర్ లో రసెల్ దూకుడు పెంచాడు. శ్రేయస్ గోపాల్ వేసిన ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లకు కోల్‌కతా 106/3
* ఆర్చర్ వేసిన 14వ ఓవర్ లో కార్తీక్ ఔటయ్యాడు. వికెట్ కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
* సిక్సర్ బాది ఊపు మీదున్న రసెల్ (24)ను అంకిత్ ఔట్ చేశాడు. భారీ షాట్‌కు యత్నించిన రసెల్ ఉనద్కత్ చేతికి చిక్కాడు. 15 ఓవర్లకు కోల్‌కతా 118/5.
* ఆర్చర్ వేసిన ఆఖరి బంతికి మోర్గాన్ సిక్సర్ బాదాడు. అంతకుముందు కమిన్స్ బౌండరీ సాధించడంతో ఈ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లకు కోల్‌కతా 141/5
* టామ్ కరన్ బౌలింగ్‌లో కమిన్స్ (12) షాట్‌కు యత్నించి శాంసన్ చేతికి చిక్కాడు. ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లకు కోల్‌కతా 149/6
* అంకిత్ రాజ్‌పుత్ బౌలింగ్‌లో నాగర్‌కోటి ఫోర్ బాదాడు. మోర్గాన్ సింగిల్స్‌కే పరిమితమయ్యాడు. ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లకు కోల్‌కతా 158/6
* టామ్ కరన్ వేసిన 20వ ఓవర్‌లో మోర్గాన్ (34) డీప్ మిడ్వికెట్ మీదుగా సిక్సర్ బాదాడు. ఈ ఓవర్‌లో పరుగులు 16 వచ్చాయి. 20 ఓవర్లకు కోల్‌కతా 174/6 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ లక్ష్యం 175 పరుగులు!