IPL 2020 Match 24 Updates : ఉత్కంఠ పోరులో కేకేఆర్‌ విజయం!

IPL 2020 Match 24 Updates : ఉత్కంఠ భరితంగా సాగిన పంజాబ్, కేకేఆర్‌ మ్యాచ్ లో కేకేఆర్‌ జట్టు రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఖరి ఓవర్ లో 14 పరుగులు అవసరం ఉన్న క్రమంలో పంజాబ్ జట్టు 11 పరుగులే చేసింది.

Update: 2020-10-10 14:21 GMT

KKRvsKXIP

IPL 2020 Match 24 Updates : ఉత్కంఠ భరితంగా సాగిన పంజాబ్, కేకేఆర్‌ మ్యాచ్ లో కేకేఆర్‌ జట్టు రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఖరి ఓవర్ లో 14 పరుగులు అవసరం ఉన్న క్రమంలో పంజాబ్ జట్టు 11 పరుగులే చేసింది. ముఖ్యంగా చివరి బంతికి ఏడూ పరుగులు అవసరం ఉన్న క్రమంలో మాక్స్‌వెల్‌ నాలుగు పరుగులను మాత్రమే చేశాడు. దీనితో రెండు పరుగుల తేడాతో కేకేఆర్‌ జట్టు విజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్‌ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. అయితే జట్టుకు మొదటి నుంచి తడబడుతూనే ఆడుతూ వచ్చింది. ఓపెనర్లు రాహుల్‌ త్రిపాఠి, శుబ్‌మన్‌ గిల్‌ ఇన్నింగ్స్ ని ప్రారంభించగా రాహుల్‌ త్రిపాఠి కేవలం నాలుగు పరుగులు చేసి షమి బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. ఆ తర్వాత వచ్చిన రాణా కూడా రన్ అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన మోర్గాన్‌ కి శుబ్‌మన్‌ గిల్‌ తోడు కావడంతో జట్టు స్కోర్ పరిగెత్తింది. ఇద్దరు కలిసి 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వత మోర్గాన్‌(24) బిష్ణోయ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఇక ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ దినేష్ కార్తీక్ ఆట స్వరూపాన్ని ఒక్కసారిగా మార్చేశాడు. 29 బాల్స్‌లోనే 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 రన్స్ చేశాడు. అర్షదీప్ వేసిన 15వ ఓవర్‌లో మూడు బౌండరీలు బాదాడు. మరోవైపు గిల్ కూడా నిలకడగా ఆడుతూ 42 బంతుల్లో హాఫ్‌సెంచరీ చేశాడు. దీనితో కేవలం 13 ఓవర్లకే కేకేఆర్‌ జట్టు 75 పరుగులు పరుగులు చేసింది. ఇక ఇన్నింగ్స్ ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి ఆ జట్టు 164 పరుగులు చేసింది. ఇక పంజాబ్ జట్టు నుంచి మహ్మద్‌ షమీ, అర్షదీప్‌ సింగ్‌, రవి బిష్ణోయ్‌ లు తలో వికెట్‌ తీశారు.

ఇక 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. అయితే ఆ తర్వాత వచ్చిన బాట్స్ మెన్స్ వరుసగా వికెట్లను సమర్పించుకోవడంతో ఆ జట్టుకు లక్ష్యం కష్టంగా మారింది. పరిషిద్ 3 వికెట్లు, సరైన్ 2 వికెట్లు తీశారు. ఇది కేకేఆర్‌కు నాలుగో విజయం కాగా, పంజాబ్‌కు ఆరో ఓటమి కావడం విశేషం.. 

Tags:    

Similar News