IPL 2020 Match 20 Updates : ముంబై ఆల్రౌండ్ మెరుపులు! రాజస్థాన్ చిత్తు..చిత్తు!!

IPL 2020 Match 20 Updates : ముంబై ఇండియన్స్ ఇటు బ్యాటింగ్.. అటు బౌలింగ్ లలో రాణించింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2020 టోర్నీలో 20వ మ్యాచ్ లో చిత్తుగా ఓడిపోయింది.

Update: 2020-10-06 18:35 GMT

ముంబై జట్టు డిపెండింగ్ జట్టు స్థాయిలో ప్రదర్శన చేసింది. బ్యాటింగ్ లో భారీ స్కోరు చేసిన ముంబై.. బౌలింగ్ లో ఆదరగొట్టేసింది. ముంబై దెబ్బకు రాజస్థాన్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఐపీఎల్ 2020 టోర్నీ 20 వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తొ తలపడిన ముంబై జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబై బౌలర్ల జోరుకు రాజస్థాన్ ఆటగాళ్ళు 18.1 ఓవర్లకె పెవిలియన్ చేరిపోయారు. దీంతో ముంబై మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకూ ముంబై ఆడిన ఆరు మ్యాచుల్లో నాలుగు మ్యాచ్ లు గెలిచి 8 పాయింట్లు సాధించింది. మరోవైపు రాజస్థాన్ ఐదు మ్యాచ్ లు ఆడి రెండు మ్యాచ్ లు గెలిచి నాలుగు పాయింట్లతో నిలిచింది.

ముంబై తన ముందుంచిన 194 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ జట్టులో జోస్ బట్లర్ తప్పించి మిగిలిన వారంతా పెవిలియన్ కు క్యూ కట్టారు. బట్లర్ ఒక్కడే 44 బంతుల్లో 70 పరుగులు చేశాడు. బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, పాటిన్ సన్ ల బౌలింగ్ ధాటికి రాజస్థాన్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు.

రాజస్తాన్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌(0) డకౌట్‌గా పెవిలియన్‌ చేరగా, స్టీవ్‌ స్మిత్‌(6) తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న సంజూ శాంసన్‌(0) డకౌట్‌ అయ్యాడు. జైస్వాల్‌, శాంసన్‌లను బౌల్ట్‌ ఔట్‌ చేయగా, స్మిత్‌ను బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. దాంతో 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది రాజస్తాన్‌. ఆపై బట్లర్‌ ఒక్కడే పోరాటం చేసినా ఎవరు నుంచి సరైన సహకారం లభించలేదు. చివర్లో ఆర్చర్‌(24;11 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌)కాసేపు మెరుపులు మెరిపించాడు.

అంతకు ముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్‌ ధాటిగా బ్యాటింగ్‌ ప్రారంభించింది. ఓపెనర్లు డీకాక్‌, రోహిత్‌ శర్మలు ఆరంభం నుంచే రాజస్థాన్ పై విరుచుకు పడ్డారు. అయితే, డీకాక్‌(23;15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) తొలి వికెట్‌గా అవుట్ అవడంతో.. సూర్యకుమార్‌ యాదవ్‌(79 నాటౌట్‌ 47 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజులోకి వచ్చాడు. వస్తూనే, రోహిత్‌ శర్మ(35; 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) తొ కలసి బ్యాట్ ను ఝుళిపించాడు. 43 పరుగుల వద్ద డీకాక్ వికెట్ కోల్పోయిన ముంబై 88 పరుగుల వద్ద రోహిత్‌ వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే ఇషాన్ కిషన్ (0) డకౌట్ అయ్యాడు. దీంతో వరుస బంతుల్లో రెండు కీలక వికెట్లను కోల్పోయి ముంబై ఇబ్బందుల్లో పడినట్టు కనిపించింది. కానే, సూర్యకుమార్ నిలకడగా ఆడడంతో ముంబై పరిస్థితి నిలకడగా నిలిచింది. కృనాల్‌(12) పెద్దగా ఆడకపోయినా, అతని తరువాత వచ్చిన హార్దిక్ పాండ్యా(19 బంతుల్లో 2 ఫోర్లు , 1సిక్స్‌తో 30 పరుగులు) సహకారంతో సూర్య కుమార్ ముంబైకి భారీ ఇన్నింగ్స్ సాధించి పెట్టాడు. రాజస్తాన్‌ బౌలర్లలో శ్రేయస్‌ గోపాల్‌ రెండు వికెట్లు సాధించగా, ఆర్చర్‌, త్యాగిలకు తలో వికెట్‌ దక్కింది.

Tags:    

Similar News