IPL 2020 in UAE or Sri Lanka : విదేశాల్లోనే ఐపీఎల్ 2020!
IPL 2020 in UAE or Sri Lanka : లాక్ డౌన్ వలన నష్టపోయిన రంగాలలో క్రీడా రంగం కూడా ఒకటి.. సంవత్సరం మొత్తం ఫిక్స్ అయిన షెడ్యుల్ ని కరోనా మొత్తం తలకిందులు చేసేసింది.
IPL 2020 in UAE or Sri Lanka : లాక్ డౌన్ వలన నష్టపోయిన రంగాలలో క్రీడా రంగం కూడా ఒకటి.. సంవత్సరం మొత్తం ఫిక్స్ అయిన షెడ్యుల్ ని కరోనా మొత్తం తలకిందులు చేసేసింది. కొన్ని సిరీస్ లు అయితే మధ్యలో రద్దు అయిపోయాయి. ఇక ఐపీఎల్ 2020 అయితే వాయిదాల మీదా వాయిదాలు పడుతూ వస్తోంది. అసలు ఐపీఎల్ 2020 ఈ సంవత్సరంలో ఉంటుందా అన్న అనుమానం కూడా కలుగుతుంది.
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో ఐపీఎల్ 2020ని దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ పాలకవర్గం ప్రకటించనుందని బీసీసీఐలోని ఓ అధికారి అంటున్నారు. ప్రస్తుతానికి వేదికను అయితే ఇంకా ఖరారు చేయలేదు. కానీ విదేశాల్లో ఐపీఎల్ 2020ని నిర్వహించే అవకాశమైతే ఉంది. దుబాయ్, శ్రీలంక ఆతిథ్యానికి సిద్ధంగా ఉన్నామని, అవసరాన్ని బట్టి వేదికను నిర్వహించాలి అని ఓ అధికారి తెలిపారు.
ఇక ఇదే విషయంపైన గతంలో ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ మాట్లాడుతూ.. ఐపీఎల్ 2020 టోర్నీ నిర్వహిస్తే చాలు .. అది ఎక్కడైనా ఫర్వాలేదని చాలా మంది భావిస్తున్నట్లుగా అయన అన్నారు. ఆటగాళ్ల భద్రత వంటి మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకొని వేదికను నిర్ణయిస్తామని అన్నారు. ఖాళీ మైదానాల్లో నిర్వహించే పక్షంలో విదేశాల్లో మాత్రం ఐపీఎల్‌ను నిర్వహిస్తే ఇబ్బంది ఉంటుందని ఆయన అన్నారు.
ఇక ప్రస్తుతం దేశంలో కరోనా రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 22,771 కేసులు నమోదు కాగా, 442 మంది ప్రాణాలు విడిచారు. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 6,48,315 కి చేరింది. ఇందులో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,35,433 ఉండగా, 3,94,226 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక కరోనాతో పోరాడి 18,655 మంది మరణించారు.