IPL 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. ఓపెనర్ పృథ్వీషా ఔట్!
IPL 2020: ఐపీఎల్ 2020 లో భాగంగా దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో ఏడు విజయాలతో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా.. మూడు విక్టరీలతో పంజాబ్ ఏడో స్థానంలో ఉంది
IPL 2020: ఐపీఎల్ 2020 లో భాగంగా దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో ఏడు విజయాలతో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా.. మూడు విక్టరీలతో పంజాబ్ ఏడో స్థానంలో ఉంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
అయితే గాయాల నుంచి కోలుకున్న రిషబ్ పంత్, హెట్‌మైర్, డేనియల్ శామ్స్ తుది జట్టులోకి వచ్చినట్లు అయ్యర్ చెప్పాడు. జోర్డాన్ స్థానంలో జేమ్స్ నీషమ్‌ను తీసుకున్నట్లు రాహుల్ వెల్లడించాడు. సీజన్ తొలి మ్యాచ్‌లో పంజాబ్‌పై ఢిల్లీ సూపర్ ఓవర్‌లో నెగ్గిన విషయం తెలిసిందే. ఇరు జట్ల ఫ్లెయింగ్ లెవన్ వివరాలు ఇలా ఉన్నాయి..
తొలుత బ్యాటింగ్ దిగిన ఢిల్లీ ఓపెనర్ పృథ్వీషా వికెట్ కోల్పోయాడు. తొలి ఓవర్‌లో శిఖర్ ధావన్ మాక్స్‌వెల్ వేసిన తొలి ఓవర్‌లో ఫోర్, సిక్స్‌తో చెలరేగిపోయి మొత్తం 13 పరుగులు రాబట్టారు. మహ్మద్ షమీ వేసిన రెండో ఓవర్‌లో మూడు పరుగులే ఇచ్చి కట్టడి చేశాడు. అర్హదీప్ సింగ్ వేసిన మూడో ఓవర్‌లో పృథ్వీషా, ధావన్ చెరో ఫోర్ బాది 9 పరుగులు తీశారు. జేమ్స్ నీషమ్ వేసిన నాలుగో ఓవర్‌లో రెండో బంతికి భారీ షాట్ ఆడబోయి పృథ్వీషా 7 (10) మాక్స్‌వెల్ చేతికి చిక్క ఔటయ్యాడు.
ఢిల్లీ జట్టు: పృథ్వీషా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), డేనియల్ సామ్స్, మార్కస్ స్టోయినిస్,రిషభ్‌పంత్, షిమ్రన్ హెట్‌మైయిర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, తుషార్ దేశ్‌పాండే, కగిసొ రబాడ.
పంజాబ్ జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), క్రిస్‌గేల్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్‌వెల్, మయాంక్ అగర్వాల్, దీపక్ హూడా, జేమ్స్ నీషమ్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమి, రవిబిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్