IPL 2020: ధోని ఓ క్రికెట్ యోగి.. జవగళ్ శ్రీనాథ్
IPL 2020: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్‌లో యోగి లాంటివాడని భారత మాజీ బౌలర్ జవగల్ శ్రీనాథ్ పోగడ్తలతో ముంచెత్తారు. ఆయన పరిణితితోనే సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా రాణించారనీ, తను జట్టును అర్థం చేసుకునే వైఖరితోనే అతని పరిణితి ఏంటో అర్ధమవుతుందని శ్రీనాథ్ అన్నారు
IPL 2020: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్‌లో యోగి లాంటివాడని భారత మాజీ బౌలర్ జవగల్ శ్రీనాథ్ పోగడ్తలతో ముంచెత్తారు. ఆయన పరిణితితోనే సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా రాణించారనీ, తను జట్టును అర్థం చేసుకునే వైఖరితోనే అతని పరిణితి ఏంటో అర్ధమవుతుందని శ్రీనాథ్ అన్నారు. తాజాగా రవిచంద్రన్ అశ్విన్‌తో 'డీఆర్‌ఎస్ విత్ ఆశ్' అనే షొలో పాల్గొన్న శ్రీనాథ్.. మహేంద్ర ధోనీని యోగిగా అభివర్ణించాడు.
ఆయన ఆలోచన విధానం,స్పందించే తీరు,గెలుపులో ఇతరులను భాగాస్వామిని చేసే గుణం, ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా వ్వవహరించే స్వభావం మహీ స్వంతమన్నారు. ధోని అశేశ అభిమాన కలిగిన నాయకుడు. నిజంగా ధోనీ ఓ యోగి. అన్నారు. అతన్ని తొలిసారిగా 2003లో కెన్యాలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో కలిశాను. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచుల్లోనూ ధోని ఒంటరిగా రాణించి.. జట్టును ఫైనల్‌కు నడిపించాడని చెప్పాడు. "ఆ సిరీస్‌లో స్పిన్నర్లతో పాటు ఫాస్ట్ బౌలర్లపై బ్యాట్ తో విరుచుకుపడ్డాడు. అతని ఆటకు ముగ్దునైనా నేను.. డ్రస్సింగ్ రూమ్ వద్దకు పరుగెత్తుకెళ్లి ధోనీని కలిశానని చెప్పారు. చాలా విషయాలను మాట్లాడుకున్నాం. నేను నీకు పెద్ద అభిమానిని అని చెప్పాను త్వరలోనే జాతీయ టీంకు ఆడాలని కోరాను. ఆ రోజు అలా కనిపించిన మహీ ఈ రోజు ఎక్కడికి వరకు వెళ్ళాడో చూశాం" చెప్పారు.
ఇటీవల భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ కూడా ధోనిని ప్రశంసల్లో ముంచెత్తాడు. భారతదేశంలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా, 50 ఏండ్ల క్రికెట్ చరిత్రలో అసలైన కెప్టెన్ ధోనినే అని అభివర్ణించాడు.