IPL 2020: క‌లలో కూడా అలా ఆలోచించ‌ను.. ఆ ప్రేమ‌ను వీడే ప్రసక్తే లేదు: కోహ్లీ

IPL 2020: విరాట్ కోహ్లీ.. ఓ సంచ‌లనం.. ప్ర‌త్య‌ర్థి ఎంత‌టి వాడైన .. ల‌క్ష్యం ఎంత పెద్దైన‌.. ఒంటి చేతితో పోరాడి జ‌ట్టును గెలిపించగ‌ల సామ‌ర్థ్యం ఉన్న మేటి నేటి క్రికెట‌ర్.

Update: 2020-09-04 14:27 GMT

IPL 2020: ‘I can never think of leaving this team’ - Virat Kohli  

IPL 2020: విరాట్ కోహ్లీ.. ఓ సంచ‌లనం.. ప్ర‌త్య‌ర్థి ఎంత‌టి వాడైన .. ల‌క్ష్యం ఎంత పెద్దైన‌.. ఒంటి చేతితో పోరాడి జ‌ట్టును గెలిపించగ‌ల సామ‌ర్థ్యం ఉన్న మేటి నేటి క్రికెట‌ర్. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఒకే ఫ్రాంచైజీతో ఉన్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లి. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు 18 ఏండ్ల కోహ్లీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. 12 సంవత్సరాలు జట్టుతోనే ఉన్నారు. 2011లోనే కోహ్లీ ఆర్‌సీబీకి కెప్టెన్ అయ్యాడు. 2016లో ఐపీఎల్ ఒకే ఎడిషన్‌లో అత్యధికంగా 973 పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ రికార్డు సృష్టించాడు. మొత్తం ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీనే ముందున్నాడు. కానీ చాంపియ‌న్ టైటిల్ పోరులో మూడు సార్లు ఫైన‌ల్ వెళ్లిన‌.. కప్పు సాధించలేకపోయింది. అయితే ఆర్‌సీబీ ఇప్పటివరకు ట్రోఫీ గెలుచుకోకపోయినా జట్టు ఫ్రాంచైజీ మాత్రం కోహ్లిని వదులుకోకపోవడమే కాకుండా అతడిపై పూర్తి నమ్మకాన్ని ఉంచింది. ఈ ఏడాది 13వ సీజన్ ఆడడానికి యూఏఈ చేరుకున్నాడు.

ఇదే విషయమై ఇటీవల ఆర్‌సీబీ ట్విట్టర్‌లో పోస్టు చేసిన వీడియోలో విరాట్ మాట్లాడుతూ .. జట్టుతో నా ప్రయాణం మొదలై 12 సంవత్సరాలు పూర్త‌య్యింది. ఈ అపూర్వ‌మైన ఈ ప్ర‌యాణంలో ఎంతో మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నాను. టైటిల్ పోరులో .. మూడు సార్లు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చాం. కానీ టైటిల్ గెలువ లేక‌పోయాం . అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ప్రేమ‌ను వీడే ప్రసక్తే లేదు. కనీసం ఆ జ‌ట్టు వదిలేయాలనీ.. ఆ ఆలోచన క‌ల‌లోకూడా ఏ రోజు రాలేద‌ని కోహ్లీ స్ప‌ష్టం చేశారు. అలాంటి సందర్భం కూడా రాలేదు. మా ఫ్రాంచైజీ నాపై ప్రేమ, సంరక్షణ ఎల్లప్పుడూ చూపుతేనే ఉంది. నేను ఆర్ సీబీ ని విడిచిపెట్టాను అని కాస్త ఎమోషనల్‌గా మాట్లాడాడు. 

Tags:    

Similar News