IPL 2020: మైదానంలో అడుగుపెట్టిన చెన్నై సూప‌ర్ కింగ్

IPL 2020: క‌రోనా క‌ల‌క‌లంతో ఇప్ప‌టివ‌ర‌కూ హోటల్ గదులకే ప‌రిమిత‌మైన చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లు ఎట్ట‌కేల‌కు సాధ‌న ప్రారంభించార‌ని సిఎస్‌కె చీఫ్ ఎగ్జిక్యూటివ్ విశ్వనాథన్ ప్రకటించారు.

Update: 2020-09-05 09:19 GMT

IPL 2020: First practice for CSK in Dubai,  

IPL 2020: క‌రోనా క‌ల‌క‌లంతో ఇప్ప‌టివ‌ర‌కూ హోటల్ గదులకే ప‌రిమిత‌మైన చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లు ఎట్ట‌కేల‌కు సాధ‌న ప్రారంభించార‌ని సిఎస్‌కె చీఫ్ ఎగ్జిక్యూటివ్ విశ్వనాథన్ ప్రకటించారు. వీరందరికీ వరుసగా మూడో సారి నిర్వహించిన పరీక్షలు కూడా నెగెటివ్‌గా వచ్చాయని, అందుకే ఆట మొదలు పెట్టామని ఆయన చెప్పారు. కోచ్‌ ఫ్లెమింగ్, బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌ మైక్‌ హస్సీ పర్యవేక్షణలో ప్రాక్టీస్ కొన‌సాగుతుంది.

అయితే కరోనా సోకిన దీపక్‌ చహర్, రుతు రాజ్‌ గైక్వాడ్‌ మాత్రం ఇంకా ప్రాక్టీస్‌ చేయడానికి వీలు లేదు. రెండు వారాల ఐసోలేషన్‌ తర్వాత మళ్లీ పరీక్ష నిర్వహించాకే వీరికి అవకాశం ఉంటుంది. ఈ ఇద్దరు మినహా మిగతా ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నారని టీమ్‌ ‌ వెల్లడించారు ధోని సారథ్యంలోని ఆట‌గాళ్లు సాధన మొదలు పెట్టారు. ఇదిలావుండగా సీనియ ర్ క్రికెటర్ సురేశ్ రైనా, హ‌ర్భ‌జ‌న్ సింగ్‌ అర్ధాంతరంగా టోర్నీకి దూరమయ్యాడు. ఈ ఇద్ద‌రు ఆట‌గాళ్లు లేక‌పోవ‌డం జ‌ట్టుకు ఎదురుదెబ్బ‌న‌నే చెప్పాలి.

మ‌రో వైపు కరోనా బారిన పడిన స్టార్ ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ కోలుకుంటున్నాడు. ఈ విషయాన్ని చాహర్ ఓ వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తాను ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, క్వారంటైన్ ముగియగానే మైదానంలోకి దిగుతానని తెలిపాడు. తనకు కరోనా పాజిటివ్ ఉందని తేలినప్పుడూ చాలా ఆందోళనకు గురయ్యానని, అయితే జట్టు యాజమాన్యం, వైద్య సిబ్బంది, సహచర క్రికెటర్లు తనలో ధైర్యాన్ని నింపడంతో ఆందోళన దూరమైందన్నాడు. మైదానంలో దిగేందుకు ఎదురు చూస్తున్నానని చాహర్ ప్రకటించాడు.

Tags:    

Similar News