IPL 2020: వార్న‌ర్ అరుదైన రికార్డు

IPL 2020: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘ‌త‌న సాధించాడు. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పది పరుగులు చేసి.. ఐపీఎల్ 5 వేల‌ పరుగుల క్ల‌బ్ లో చేరాడు.

Update: 2020-10-18 14:46 GMT

IPL 2020: వార్న‌ర్ అరుదైన రికార్డు

IPL 2020: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘ‌త‌న సాధించాడు. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పది పరుగులు చేసి.. ఐపీఎల్ 5 వేల‌ పరుగుల క్ల‌బ్ లో చేరాడు. ఐపీఎల్‌లో ఈ మైలురాయిని అందుకున్న తొలి విదేశీ క్రికెటర్‌ వార్నర్ కావడం మ‌రో విశేషం. ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ ఈ ఘ‌న‌త సాధించిన వారిలో రైనా, కోహ్లి, రోహిత్ లు ఉండ‌గా.. ఇప్పుడూ సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా చేరాడు. వార్న‌ర్ ఈ ఘ‌న‌త‌ను 135 ఇన్నింగ్స్‌ల్లో సాధించాడు. ఈ క్ర‌మంలోనే ఐపీఎల్‌లో వేగంగా 5 వేల రన్స్ చేసిన ఆటగాడిగా కోహ్లి (157) రికార్డును వార్నర్ తిరగరాశాడు.

5వేల ప‌రుగుల క్ల‌బ్‌లో తొలుత సురేశ్ రైనా చేరగా.. తర్వాత విరాట్ కోహ్లి సైతం ఈ క్లబ్‌లో చేరాడు. 178 ఇన్నింగ్స్‌ల్లో 5759 రన్స్‌ చేసిన కోహ్లి.. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సీజన్లో శిఖర్ ధావన్ కూడా 5 వేల పరుగుల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. శనివారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో సెంచ‌రీ చేశాడు. ఇప్ప‌టివ‌ర‌కూ 167 ఇన్నింగ్స్‌ల్లో 4938 ప‌రుగులు పూర్తి చేశాడు.

Tags:    

Similar News