IPL 2020: కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ గెలుపు.. ఇక చెన్నై కథ ముగిసేనా?!
IPL 2020: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020లో హాట్ ఫేవరేట్‌గా బరిగా దిగిన చెన్నై .. వరుస అపజయాలతో కష్టాల్లో పడింది. ఇక ఫ్లేఆప్ వెళ్లే అవకాశం దాదాపు కోల్పోయినట్లే.. ఐపీఎల్ చరిత్రలో ప్రతి సీజన్‌లో ఆజట్టు ప్లేఆఫ్స్ చేరగా.. ఈ సీజన్‌లో చెన్నై ప్లేఆఫ్స్ చేరడం దాదాపు అసాధ్యం మారింది.
IPL 2020: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020లో హాట్ ఫేవరేట్‌గా బరిగా దిగిన చెన్నై .. వరుస అపజయాలతో కష్టాల్లో పడింది. ఇక ఫ్లేఆప్ వెళ్లే అవకాశం దాదాపు కోల్పోయినట్లే.. ఐపీఎల్ చరిత్రలో ప్రతి సీజన్‌లో ఆజట్టు ప్లేఆఫ్స్ చేరగా.. ఈ సీజన్‌లో చెన్నై ప్లేఆఫ్స్ చేరడం దాదాపు అసాధ్యం మారింది. ధోనీ రిటైర్‌మెంట్ తరువాత జరుగుతున్న టోర్నీ కాబట్టి .. మెరుపులు మెరిపిస్తాడని అభిమానులు భావించారు. కానీ , వరుస ఓటములతో డీలా పడింది. సోమవారం రాజస్థాన్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై ఓటమిపాలైంది. దీంతో ఆ జట్టు టోర్నీలో ఏడో పరాజయాన్ని చవిచూసింది. ఆల్‌రౌండర్ ఆధిపత్యాన్ని చూపించిన రాజస్థాన్ నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. లీగ్ దశంలో చెన్నై ఇంకో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. ప్రస్తుతం చెన్నై పరిస్థితుల్లో ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
ఇరు జట్లకు డూ ఆర్ డై లాంటి మ్యాచ్‌లో చెన్నై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. రాజస్థాన్ బౌలర్ల ధాటికి చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులే చేసింది. ఓపెనర్లు శామ్ కరన్ (25)22, ఫాఫ్ డుప్లెసిస్ (9)10 పరుగులు చేశారు. మూడో ఓవర్‌లోనే చెన్నై తొలి వికెట్ చేజార్చుకోగా.. అనంతరం వచ్చిన ఆటగాళ్లు షేన్ వాట్సన్ (8), అంబటి రాయుడు (13) లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఈ తరుణంలో వచ్చిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జట్టుకు అండగా చూశారు. 30బంతుల్లో 4పోర్లుతో 35 పరుగులు చేశారు. ఈ కీలక మ్యాచ్ లో ధోనీ ఆదుకుంటాడని అభిమానులు ఆశించిన .. ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. కేవలం చెన్నై 125 పరుగులు చేయగలిగింది.
చెన్నై నిర్దేశించిన 126 పరుగుల లక్ష్యంను చేధించడానికి బరిలోకి రాజస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. చెన్నై పేస్ బౌలర్ దీపక్ చాహర్ (2/18) చక్కని బౌలింగ్‌తో రాజస్థాన్ 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజ్‌లో వచ్చిన జోస్ బట్లర్ ఆచీతూచీ ఆడుతూ(70 నాటౌట్; 48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేశాడు. బట్లర్్ కు తోడుగా కెప్టెన్ స్టీవ్ స్మిత్ (26 నాటౌట్; 34 బంతుల్లో 2 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ మరో 15 బంతులు ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. చెన్నై బౌలర్లలో దీపక్ చహర్ రెండు, జోష్ హేజిల్‌వుడ్ ఓ వికెట్ పడగొట్టారు. రాజస్తాన్ ఈ విజయంలో పాయింట్ల పట్టికలో 5 వ స్థానంలో నిలిచింది.