చెన్నై విక్టరీ.. టోర్నీ నుంచి పంజాబ్ ఔట్!
ఐపీఎల్ 2020 సీజన్‌లో కింగ్స్ పంజాబ్ కథ ముగిసింది. వరుసగా ఐదు విజయాలతో ఆశలు రెకెత్తించిన రాహుల్ సేన బ్యాక్ టు బ్యాక్ పరాజయాలతో ఇంటిబాట పట్టింది. ఆదివారం ఏక పక్షంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 9 వికెట్లతో చిత్తయింది.
ఐపీఎల్ 2020 సీజన్‌లో కింగ్స్ పంజాబ్ కథ ముగిసింది. వరుసగా ఐదు విజయాలతో ఆశలు రెకెత్తించిన రాహుల్ సేన బ్యాక్ టు బ్యాక్ పరాజయాలతో ఇంటిబాట పట్టింది. ఆదివారం ఏక పక్షంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 9 వికెట్లతో చిత్తయింది.
ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పని సరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు షాక్ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్‌లతో పాటు రాణించడంతో చెన్నై వరుసగా మూడో మ్యాచ్ నెగ్గింది. లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ 6 విజయాలతో 12 పాయింట్లతో అధికారికంగా ప్లేఆఫ్స్‌కు దూరమైంది. ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించిన చెన్నై హ్యాట్రిక్ విజయాలతో సీజన్‌ను గెలుపుతో ముగించింది.
పంజాబ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 18.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 49 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్‌తో చెలరేగాడు. గైక్వాడ్ అర్ధశతకానికి తోడు డుప్లెసిస్ 48 పరుగులు, అంబటి రాయుడు 30 పరుగులు చేయడంతో చెన్నై అలవోకగా గెలుపొందింది.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఆఖర్లో దీపక్ హుడా 63 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అద్భుత అర్ధశతకంతో రాణించడంతో పంజాబ్ పోరాడే స్కోరు సాధించింది. లుంగి ఎంగిడి నిప్పులు చెరగి కీలకమైన 3 వికెట్లు పడగొట్టడంతో పంజాబ్ బ్యాటింగ్ పేకమేడను తలపించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ మినహా ఇతర బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్, నికోలస్ పూరన్, మన్‌దీప్ సింగ్ దారుణంగా విఫలమయ్యారు. చెన్నై బౌలర్ల ముందు చేతులెత్తేశారు. చెన్నై సూపర్ స్టార్ట్ గైక్వాడ్ మరోసారి చెలరేగి బ్యాటింగ్ చేయడంతో పంజాబ్ కథ ముగిసింది.