IPL 2020: చివరి ఓవర్ పై ధోని క్లారిటీ..
IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పరంపర కొనసాగుతుంది. శనివారం రాత్రి షార్జా వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ధోనీసేన 5 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో చెన్నై ఓడిపోవడంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పరంపర కొనసాగుతుంది. శనివారం రాత్రి షార్జా వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ధోనీసేన 5 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో చెన్నై ఓడిపోవడంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో చివరి ఓవర్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జడేజాను బౌలింగ్ కు దింపడంపై చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్లారిటీ ఇచ్చాడు.
'' లక్ష్య ఛేదనలో ఉన్న ప్రత్యర్థి జట్టుకు ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు కావాల్సి ఉంది. క్రీజులో శిఖర్ ధావన్ ఉన్నాడు. అతను భారీ సిక్సర్లు కొట్టలేడు. మ్యాచ్ గెలిచేయొచ్చు. బ్రావో బౌలింగ్ చేయాల్సి ఉన్నాతాను ఫిట్ గా లేనని చెప్పి డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళాడు. జడేజా, కరణ్ శర్మ కు మాత్రమే చెరో ఓవర్ మిగిలి ఉన్నాయ్ దీంతో రిస్క్ అని తెలిసినా జడేజాకు అవకాశం ఇచ్చాను" అని ధోని చెప్పాడు. కాగా జడేజా వేసిన ఆ ఓవర్ లో అక్షర్ పటేల్ ఏకంగా 3 సిక్సర్లు కొట్టి చెన్నైకి షాక్ ఇచ్చాడు.
'కీలకమైన క్యాచ్‌లు వదిలేయడం వల్లే మ్యాచ్‌ను కోల్పోయాం. అయితే ధావన్ ఇన్నింగ్స్‌ను తక్కువ చేయడానికి ఏం లేదు. అతను మేం ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్ కంటే రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ నెమ్మదించి బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. ఆఖర్లో సామ్ కరన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతనిలో ఆత్మవిశ్వాసం కనిపించింది' అని చెన్నై కెప్టెన్ ధోనీ పేర్కొన్నాడు.