IPL 2020: దీపక్ చాహర్‌కు లైన్ క్లీయర్
IPL 2020: సీఎస్‌కే అభిమానులకు ఓ శుభవార్త. ఆ జట్టు ఫాస్ట్‌బౌలర్ దీపక్ చాహర్ కు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షలో ఆయనకు నెగిటివ్ అని తెలిపింది. దీంతో దీపక్ త్వరలోనే జట్టు సభ్యులతో కలుస్తాడని ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు.
IPL 2020: సీఎస్‌కే అభిమానులకు ఓ శుభవార్త. ఆ జట్టు ఫాస్ట్‌బౌలర్ దీపక్ చాహర్ కు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షలో ఆయనకు నెగిటివ్ అని తెలిపింది. దీంతో దీపక్ త్వరలోనే జట్టు సభ్యులతో కలుస్తాడని ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు.నేటి నుంచి మైదానంలో ప్రాక్టీస్ ప్రారంభిస్తాడని, సీఎస్‌కే వైపు నుంచి మాత్రమే కాకుండా బీసీసీఐ వైద్య బృందం నుంచి కూడా చాహర్‌కు క్లియరెన్స్ లభించిందని, మైదానంలో ప్రాక్టీస్ చేయడానికి అతడు సిద్ధంగా ఉన్నాడని విశ్వనాథన్ వెల్లడించారు.
వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న దీపక్ రెండోసారి నిర్వహించిన పరీక్ష లోనూ నెగెటివ్ రావడంతో అతను జట్టుతో కలిశాడు. సీఎస్‌కే, బీసీసీఐ వైపు నుంచి దీపక్‌కు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయని, ఈ రోజు నుంచి శిక్షణ ప్రారంభిస్తాడని ఆయన చెప్పారు.
మరో వైపు సురేష్ రైనా స్థానంలో మరో విదేశీ ప్లేయర్ డేవిడ్ మలన్(ఇంగ్లాండ్)ను జట్టులోకి తీసుకోవాలని సీఎస్‌కే యోచిస్తున్నదా? అనే ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. తమ జట్టులో విదేశీ కోటా జాబితా ఫుల్‌గా ఉందన్నారు. అందువల్ల మరో విదేశీయుడిని ఎలా తీసుకుంటామో నాకైతె తెలియదని, మా జట్టులో ఏ విదేశీ ఆటగాడు కూడా గాయ పడలేదని చెప్పుకొచ్చాడు.
Cherry takes you through the #YelloveGame that was. 🦁💛 #WhistlePodu @deepak_chahar9 @russcsk pic.twitter.com/RaIu6EUXsp
— Chennai Super Kings (@ChennaiIPL) September 11, 2020