IPL 2020: ఐపీఎల్ షెడ్యూల్ ఆలస్యం!?
IPL 2020: మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ 13వ సీజన్ ఆరంభం కానున్నది. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి ఆందోళన కలిగిస్తున్నాయి. ఇ
IPL 2020: మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ 13వ సీజన్ ఆరంభం కానున్నది. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక ఐపీఎల్ 2020 షెడ్యూల్‌ను బీసీసీఐ శనివారం విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజా పరిమాణాల నేపథ్యంలో ఐపీఎల్ 2020 షెడ్యూల్ విడుదలను బీసీసీఐ నిలిపివేసే అవకాశాలు ఉందని తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన తర్వాత.. షెడ్యూల్ విడుదల చేయనుంది. 'పరిస్థితిని పరిష్కరించడానికి తగిన చర్యలు మా వద్ద ఉన్నాయి. ఐపీఎల్ టోర్నీకి ప్రస్తుతం వచ్చిన ముప్పేమీ లేదు. అయితే తాజా పరిమాణాల నేపథ్యంలో ఐపీఎల్ 2020 షెడ్యూల్ ప్రకటన ఆలస్యం కానుంది' అని బీసీసీఐ ఉన్నతాధికారులు తెలిపారు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఓ క్రీడాకారుడు, 10 మంది సహాయక సిబ్బందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. కానీ ఆటగాని పేరు శుక్రవారం బయటకు రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం భారత్ తరపున ఆడుతున్న పేసర్ దీపక్ చాహర్‌కే కరోనా సోకిందని తెలిసింది. వెంటనే అప్రమత్తమైన సీఎస్‌కే యాజమాన్యం అతన్ని14 రోజుల క్వారంటైన్‌లో ఉంచారు. కానీ ఆ టీం యాజమాన్యం మాత్రం పేరుని అధికారికంగా ఆ ఫ్రాంఛైజీ శుక్రవారం ప్రకటించలేదు. ఇక చాహర్‌లో ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని సమాచారం. మరోవైపు 10 మంది సహాయక సిబ్బంది కూడా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. వైరస్ సోకిన అందరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందట.