IPL 2020 : భారత మాజీ క్రికెటర్, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్‌కు బీసీసీఐ షాకిచ్చింది. ఐపీఎల్ కోసం ఏడుగురు సభ్యులతో కూడిన కామెంటరీ ప్యానల్ లో మంజ్రేకర్‌కు చోటు కల్పించలేదు. ఐపీఎల్ 2020 సీజన్ కోసం కామెంట్రీ ఫ్యానల్‌ని తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. ఏడు మందితో కూడిన ఈ ఫ్యానల్‌లో సంజయ్ మంజ్రేకర్‌కి చోటు దక్కలేదు.
2019 వన్డే ప్రపంచకప్ సమయంలో రవీంద్ర జడేజాని అరకొర ఆటగాడంటూ అభివర్ణించి విమర్శలు ఎదుర్కొన్న మంజ్రేకర్.. ఈ ఏడాది మార్చిలో బీసీసీఐ కామెంట్రీ ఫ్యానల్‌లో తొలుత చోటు కోల్పోయాడు. ఈ ప్యానల్ లో గవాస్కర్, మురళీ కార్తీక్, దీప్ దాస్ గుప్తా, శివరామకృష్ణన్, రోహన్ గవాస్కర్, హర్ష భోగ్లే, అంజుమ్ చోప్రాలకు చోటు కల్పించారు. మురళీ కార్తీక్, దాస్ గుప్తాలు అబుదాబిలో మిగిలిన వారు దుబాయ్, షార్జా వేదికల్లో కామెంటేటర్లుగా వ్యవహరించనున్నారు. సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్, అబుదాబి, షార్జా వేదికల్లో ఐపీఎల్ జరుగనుంది. లీగ్‌లో 21 మ్యాచ్‌ల చోప్పున దుబాయ్, అబుదాబి ఆతిథ్యమివ్వనుండగా, షార్జాలో 14 మ్యాచ్‌లు జరుగనున్నాయి.