IPL 2020: ఓటమికి కారణం ధోనినే: గౌతమ్ గంభీర్

IPL 2020: ఐపీఎల్ 2020లో నిన్న జ‌రిగిన రాజస్థాన్ రాయల్స్, చెన్నైల మ్యాచ్ క్రికెట్ అభిమానుల‌కు అస‌లైన మ‌జా పంచింది. ఈ మ్యాచ్‌లో సిక్స‌ర్ల వ‌ర్షం కురుస్తుంది.

Update: 2020-09-23 06:50 GMT

dhoni

IPL 2020: ఐపీఎల్ 2020లో నిన్న జ‌రిగిన రాజస్థాన్ రాయల్స్, చెన్నైల మ్యాచ్ క్రికెట్ అభిమానుల‌కు అస‌లైన మ‌జా పంచింది. ఈ మ్యాచ్‌లో సిక్స‌ర్ల వ‌ర్షం కురుస్తుంది. ప‌రుగుల వ‌ర‌ద పారింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా రంగంలోకి దిగిన రాజ‌స్థాన్ .. చెన్నైపై రెచ్చిపోయింది. శాంసన్ ప‌రుగుల సునామీ, స్మిత్ మాస్టర్ స్ట్రోక్.. వెరసి రాజస్థాన్‌ చెన్నైని మట్టి కరిపించింది.

తొలుత టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకోగా.. రాజస్థాన్ బ్యాటింగ్‌కు దిగింది. స్మిత్ ఓపెనర్,జైస్వాల్ లు ఓపెన‌ర్లుగా రాగా, జైస్వాల్ ప్రారంభంలోనే ఔటయ్యాడు. వన్ డౌన్‌లో వ‌చ్చిన శాంసన్.. వచ్చీ రాగానే చెన్నైకి చుక్కలు చూపించాడు. దొరికిన బంతిని దొరికిన‌ట్టు దాటించారు. 32 బంతుల్లో 74 పరుగులు చేశారు. అలాగే స్టీవ్ స్మిత్ 47 బంతుల్లో 69 పరుగులు తోడవడం వల్ల రాజస్థాన్ భారీ స్కోరు చేసింది. తొలిసారి 200 పైగా స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. అయితే శాంసన్ తరువాత వరుసగా వికెట్లు కోల్పోయినా.. చివరి ఓవర్లో వ‌చ్చిన ఆర్చర్ సునామీ సృష్టించారు. ఇన్నింగ్స్‌తో 20 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్లకు గానూ 216 పరుగులు చేసింది రాయల్స్.

భారీ ల‌క్ష్య చేధ‌న‌లో ధోనిసేన స‌రైన ప్ర‌ణాళిక లేక‌ త‌డ బ‌డింది. స‌రైన స‌మ‌యంలో ధోని బ్యాటింగ్ రాక పోవ‌డం వ‌ల్లే చెన్నై ఓట‌మి పాలైందని ఎంఎస్ ధోనీని గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శించాడు. రాజస్థాన్ రాయల్స్‌పై సిఎస్‌కె 16 పరుగుల తేడాతో ఓడిపోవడానికి ధోనినే కార‌ణమ‌ని అన్నారు. 114/5 వద్ద ధోని బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆ సమయంలో విజయం కోసం జట్టుకు ఇంకా 103 పరుగులు అవసరం, అస‌లు సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్ క‌న్న ముందు ధోని బ్యాటింగ్‌కు వ‌చ్చి ఉండే ఫ‌లితం వేరేలా ఉండేద‌ని అన్నారు.

Tags:    

Similar News