India Vs England 1st ODI: తొలి వన్డేలో ఆ ఇద్దరికీ మొండిచేయ్యేనా..?

India Vs England 1st ODI: పుణె వేదికగా ఇంగ్లాండ్‌తో మంగళవారం జరగనున్న మొదటి వన్డేకి టీమిండియా సిద్ధమైంది.

Update: 2021-03-22 09:52 GMT

టీమిండియా (ఫొటో ఇన్‌స్టాగ్రాం)

India Vs England 1st ODI: పుణె వేదికగా ఇంగ్లాండ్‌తో మంగళవారం జరగనున్న మొదటి వన్డేకి టీమిండియా సిద్ధమైంది. ఇరుజట్లు టీం కూర్పుపై కసరత్తులు ప్రారంభించాయి. కాగా, టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల ముగిసిన ఐదు టీ20ల సిరీస్‌ని 3-2తో టీమిండియా చేజిక్కించుకున్న

సంగతి తెలిసిందే. ఇక మొదటి వన్డేలోనూ గెలిచి వన్డే సిరీస్ లోనూ శుభారంభం చేయాలని ఆశిస్తోంది భారత్. మూడు వన్డేల సిరీస్‌ కోసం ఇప్పటికే 18 మందితో కూడిన భారత్ జట్టుని సెలెక్టర్లు ప్రకటించారు. కాగా.. ప్టేయింగ్ 11 విషయంలో మాత్రం కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారోనని అంతా భావిస్తున్నారు. కానీ, అలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోరని కొంతమంది మాజీలు వ్యక్తం చేస్తున్నారు. అదే నిజమైతే.. సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది.

రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు ఓపెనింగ్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. అయితే.. కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఓపెనింగ్ బరిలో దిగుతారా లేదా అనేది చూడాలి. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, నాలుగులో శ్రేయాస్ అయ్యర్ రానున్నారు. అలాగే వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐదో స్థానం, హార్దిక్ పాండ్యా ఆరో స్థానంలో ఫిక్స్ అయ్యారు. ఇక బౌలింగ్‌ పరంగా భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్, శార్ధూల్ ఠాకూర్‌ రూపంలో ముగ్గురు పేసర్లని తుది జట్టులోకి చేరనున్నారు. అయితే నటరాజన్ కి కూడా ఎంత మేర అవకాశం ఇస్తారో తెలియాల్సి ఉంది. స్పిన్నర్ల కోటాలో యుజ్వేందర్ చాహల్‌కి జోడీగా కృనాల్ పాండ్యా ఆడే అవకాశం ఉంది. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం కృనాల్ సొంతం. బౌలింగ్‌లో అవసరమైతే.. హార్దిక్ పాండ్యా కూడా కొన్ని ఓవర్లు ఆల్ రౌండర్ పాత్ర పోషించనున్నాడు.

తొలి వన్డేకి టీమిండియా తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, శార్ధూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేందర్ చాహల్, టి.నటరాజన్ 

Tags:    

Similar News