IND vs SL: శ్రీలంకతో నేడు కీలకపోరు.. గెలిస్తే భారత్ సెమీస్ టిక్కెట్ కన్ఫర్మ్ అవుతుందా? షాకిస్తోన్న లెక్కలు..
Team India Semi Final Equation: మహిళల T20 ప్రపంచ కప్ 2024 రెండో మ్యాచ్ అక్టోబర్ 9న భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య జరగనుంది.
Team India Semi Final Equation: మహిళల T20 ప్రపంచ కప్ 2024 రెండో మ్యాచ్ అక్టోబర్ 9న భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఒకవైపు పాయింట్ల పట్టికలో స్థానం మెరుగుపరుచుకోవడమే కాకుండా ఆసియాకప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో భారత్ బరిలోకి దిగుతుండగా, మరోవైపు ఈ ప్రపంచకప్‌లో తొలి విజయం సాధించాలనే ఉద్దేశంతో శ్రీలంక బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సెమీఫైనల్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? లేదా? అనే లెక్కలు ఇప్పుడు తెలుసుకుందాం..
పాకిస్థాన్‌ను ఓడించి ఖాతా తెరిచిన భారత్..
భారత్ తన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 58 పరుగుల భారీ ఓటమిని చవిచూసింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి విజయ ఖాతా తెరిచింది. అదే సమయంలో, శ్రీలంక ప్రస్తుతం గ్రూప్ A పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇప్పటికీ తన మొదటి విజయం కోసం వేచి ఉంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో శ్రీలంక 31 పరుగుల తేడాతో ఓటమి చవిచూడగా, శనివారం ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఓడింది.
భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మెడ నొప్పికి గురైంది. ఆ తర్వాత ఆమె మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. గాయం కారణంగా పూజా వస్త్రాకర్ కూడా చివరి మ్యాచ్‌లో ఆడలేకపోయింది. ఆమె స్థానంలో సజ్నా సజీవన్‌కు అవకాశం కల్పించారు.
భారత్‌దే పైచేయి..
టీ20లో శ్రీలంకపై భారత్‌దే పైచేయి. శ్రీలంకపై భారత్ 19 సార్లు ఓడింది. అయితే శ్రీలంక ఈ ఫార్మాట్‌లో భారత్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలవగలిగింది. అయితే, భారత్‌కు ఈ ఐదు పరాజయాల్లో ఆసియాకప్ ఫైనల్‌లో ఓటమి కూడా ఉంది. శ్రీలంక చేతిలో ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ కోరుకుంటోంది.
విజయంతో భారత్‌కు సెమీస్ టికెట్ ఖాయమయ్యేనా?
ప్రస్తుతం భారత్ తన గ్రూప్‌లో 2 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. రెండు వరుస విజయాలతో ఆస్ట్రేలియా జట్టు 4 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. శ్రీలంకను ఓడించడంలో భారత జట్టు విజయం సాధిస్తే.. 4 పాయింట్లు కూడా సాధించి భారత జట్టు రెండో స్థానానికి చేరుకుంటుంది. అయితే, ఆ తర్వాత కూడా ఆ జట్టు సెమీఫైనల్‌కు నేరుగా టికెట్ పొందలేరు. సెమీ-ఫైనల్‌లోకి నేరుగా ప్రవేశించాలంటే, భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగే చివరి గ్రూప్ మ్యాచ్‌లో గెలవాల్సి ఉంటుంది.
భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, దయాళన్, దయాళన్ ఆశా శోభన , రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సజ్నా సజీవన్.
శ్రీలంక జట్టు: చమ్రీ అటపట్టు (కెప్టెన్), విష్మి గుణరత్నే, నీలాక్షి డిసిల్వా, హాసిని పెరీరా, అనుష్క సంజీవని, హర్షిత సమరవిక్రమ, అమ కాంచన, కవిషా దిల్హరి, సుగంధికా కుమారి, అచినీ కులసూర్య, ఉదేశిక ప్రబోధని, రౌషిక ప్రబోధని, ఇనోషిక ప్రబోధని , సచిని.