IND vs BAN: బంగ్లాదేశ్ జట్టుకు బిగ్ షాక్.. డేంజరస్ ప్లేయర్ ఔట్.. టీ20ల్లోనూ ఘోర పరాజయం తప్పదా?

India vs Bangladesh: బంగ్లాదేశ్ జట్టు టెస్ట్ సిరీస్‌లో ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమిని మరచిపోయి టీ20లో పోటీపడేందుకు సిద్ధమైంది.

Update: 2024-10-06 05:38 GMT

IND vs BAN: బంగ్లాదేశ్ జట్టుకు బిగ్ షాక్.. డేంజరస్ ప్లేయర్ ఔట్.. టీ20ల్లోనూ ఘోర పరాజయం తప్పదా?

India vs Bangladesh: బంగ్లాదేశ్ జట్టు టెస్ట్ సిరీస్‌లో ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమిని మరచిపోయి టీ20లో పోటీపడేందుకు సిద్ధమైంది. 14 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌ జరగనున్న గ్వాలియర్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. బంగ్లాదేశ్‌లో జట్టులో ముఖ్యమైన ఆటగాడు లేకపోవడంతో టీమిండియాదే పైచేయి కనిపిస్తోంది. పిచ్ విషయంలో జట్టు ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ తౌహీద్ హృదయ్ మ్యాచ్‌కు ముందు కీలక అప్‌డేట్ ఇచ్చాడు.

బంగ్లాదేశ్ జట్టు తన స్టార్ ప్లేయర్‌ షకీబ్ అల్ హసన్‌ను సేవలను కోల్పోయింది. టీ20 సిరీస్‌లో ఆడడం లేదు. ఈ సందర్భంగా తౌహీద్ హృదయ్ షకీబ్ అల్ హసన్‌ను గుర్తు చేసుకున్నాడు. షకీబ్ అల్ హసన్ జూన్‌లో తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. షకీబ్ అల్ హసన్ తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఓడిపోయే మ్యాచ్‌ను కూడా మలుపు తిప్పగల సత్తా కలిగి ఉన్నాడు. ఈ క్రమంలో తౌహిద్ హృదయ్ పిచ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

పిచ్ ఎలా ఉంటుంది?

మ్యాచ్‌కు ముందు తౌహీద్ హృదయ్ మాట్లాడుతూ, 'టీ20 అనేది ఫోర్లు, సిక్సర్లు కురిసే ఫార్మాట్. ప్రతి జట్టు పరుగులు చేయాలని కోరుకుంటుంది. అయితే, చాలా కాలంగా ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగలేదు. ఇది కొత్త వేదిక. ఇక్కడ పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో మాకు తెలియదు. ఇక్కడ కూడా ఐపీఎల్ మ్యాచ్ జరగలేదు. కానీ ప్రాక్టీస్ వికెట్ చూస్తుంటే పిచ్ స్లోగా ఉందని భావిస్తున్నాను. ఈ వికెట్‌పై పెద్ద స్కోర్లు సాధ్యం కాదు.

ఒత్తిడిలో బంగ్లాదేశ్‌..

తౌహీద్ మాట్లాడుతూ, 'మాపై ఒత్తిడి ఉంది. కానీ, మేం దాని గురించి ఆలోచిస్తే బాగా రాణించలేం. మేం ఎల్లప్పుడూ ఓకే విధానాన్ని అనుసరిస్తాం. షకీబ్ భాయ్ ఇకపై జట్టులో భాగం కాదు. మేం అతని సేవలను కోల్పోతాం. అయితే, అందరూ పదవీ విరమణ చేయాల్సిందే. భారత్‌ను ఓడించడంలో విజయం సాధిస్తామని ఆశిస్తున్నాం' అంటూ చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News