IPL 2025: ఐపీఎల్ జట్లకు డెడ్‌లైన్ పెట్టిన బీసీసీఐ.. ధోనీ, రోహిత్ శర్మల భవితవ్యం తేలనుంది ఎప్పుడంటే?

IPL Retention 2025: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) IPL 2025 మెగా వేలానికి ముందు నిలుపుదల నిబంధనలను విడుదల చేసింది.

Update: 2024-10-01 16:30 GMT

IPL 2025: ఐపీఎల్ జట్లకు డెడ్‌లైన్ పెట్టిన బీసీసీఐ.. ధోనీ, రోహిత్ శర్మల భవితవ్యం తేలనుంది ఎప్పుడంటే?

IPL Retention 2025: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) IPL 2025 మెగా వేలానికి ముందు నిలుపుదల నిబంధనలను విడుదల చేసింది. అలాగే జట్ల పర్స్, రైట్ టు మ్యాచ్ కార్డ్ (RTM), విదేశీ ఆటగాళ్లకు సంబంధించి కూడా నియమాలు జారీ చేసింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో విదేశీ ఆటగాళ్లు ఉలిక్కిపడ్డారు. వాస్తవానికి, వేలంలో ఎంపికైన తర్వాత సీజన్ నుంచి నిష్క్రమించే విదేశీ ఆటగాళ్లను నిషేధించాలని IPL నిర్ణయించింది. కేవలం ఆరోగ్య పరిస్థితితో మాత్రమే లీగ్ నుంచి నిష్క్రమించడానికి అనుమతిస్తారు.

గడువును ఖరారు చేసిన బీసీసీఐ..

అలాగే అక్టోబరు 31లోగా రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని ఫ్రాంచైజీలను బీసీసీఐ కోరింది. అంటే ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అన్ని జట్లకు డెడ్‌లైన్ వచ్చింది. అంటే, అంతకుముందే వెటరన్ ఆటగాళ్లు మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌ల భవిష్యత్తు ఖరారు కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా నిలబెట్టుకోవచ్చు. మరోవైపు కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్‌ను వీడవచ్చు. అదే సమయంలో, రోహిత్, సూర్య ముంబై ఇండియన్స్‌తో విడిపోవచ్చు.

రిటెన్షన్ గురించి కీలక నియమం..

IPL గవర్నింగ్ కౌన్సిల్ రిటెన్షన్ లేదా రైట్ టు మ్యాచ్ (RTM) కార్డ్ ఆప్షన్‌ని ఉపయోగించి గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను ఉంచుకోవడానికి జట్లకు అనుమతి ఉంటుందని ధృవీకరించింది. అక్టోబరు 31 లేదా అంతకు ముందు అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఆటగాళ్లను వేలంలో క్యాప్‌గా పరిగణించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. నిలుపుదల, RTM కలయిక IPL ఫ్రాంచైజీపై ఆధారపడి ఉంటుంది. అయితే, రిటెన్షన్/RTMలతో గరిష్టంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఒకరు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లను కలిగి ఉండవచ్చు. లేదా ఇద్దరు ఆన్ క్యాప్డ్ ప్లేయర్లను కలిగి ఉంచవచ్చు.

గుడ్‌న్యూస్ చెప్పిన జై షా..

ఇది కాకుండా ఒక్కో జట్టు వేలం మొత్తాన్ని కూడా రూ.120 కోట్లకు పెంచారు. ప్లేయింగ్-11లో భాగమైన ఆటగాళ్లందరికీ ఒక్కో మ్యాచ్‌కు రూ.7.05 లక్షల మ్యాచ్ ఫీజుగా అందజేస్తామని ఐపీఎల్ చారిత్రాత్మక నిర్ణయం వెల్లడించింది. ఈ పరిణామాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా కూడా ధృవీకరించారు. జైషా మాట్లాడుతూ, “ఐపీఎల్‌లో స్థిరత్వం, మెరుగైన ప్రదర్శనను చేసేందుకు ఇదొక చారిత్రాత్మక చర్యగా, మా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజుగా రూ. 7.5 లక్షలను ప్రవేశపెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక సీజన్‌లో అన్ని లీగ్ మ్యాచ్‌లు ఆడే క్రికెటర్‌కు ఒప్పందం కుదుర్చుకున్న మొత్తానికి అదనంగా రూ.1.05 కోట్లు అందుతాయి. ఒక్కో ఫ్రాంచైజీ ఈ సీజన్ కోసం రూ.12.60 కోట్ల మ్యాచ్ ఫీజును కేటాయిస్తుంది. ఐపీఎల్‌కి, మన ఆటగాళ్లకు ఇది కొత్త శకం" అంటూ చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News