Asian Games: ఫైనల్ చేరిన భారత జట్టు.. స్వర్ణ పతకానికి కేవలం ఒక్క అడుగు దూరంలోనే..!

Asian Games 2023, IND W vs BAN W: చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడలు-2023 ఫైనల్‌కు భారత మహిళల క్రికెట్ జట్టు టికెట్ పొందింది.

Update: 2023-09-24 08:00 GMT

Asian Games: ఫైనల్ చేరిన భారత జట్టు.. స్వర్ణ పతకానికి కేవలం ఒక్క అడుగు దూరంలోనే..!

Asian Games 2023, IND W vs BAN W: చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడలు-2023 ఫైనల్‌కు భారత మహిళల క్రికెట్ జట్టు టికెట్ పొందింది. ఆదివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో స్మృతి మంధాన సారథ్యంలోని టీమిండియా 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఈ విజయంతో భారత జట్టు కూడా పతకాన్ని ఖాయం చేసుకుంది. ఇప్పుడు ఈ జట్టు స్వర్ణానికి కేవలం ఒక గెలుపు దూరంలో నిలిచింది.

భారత్ ఘన విజయం..

హాంగ్‌జౌలోని పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఈ నిర్ణయం పూర్తిగా తప్పని తేలిపోవడంతో బంగ్లాదేశ్ జట్టు మొత్తం పేకమేడలా కుప్పకూలింది. నిగర్ సుల్తానా (12) మాత్రమే రెండంకెల స్కోరును అందుకోగలిగింది. బంగ్లాదేశ్ జట్టు 17.5 ఓవర్లలో 51 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత జట్టు 8.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

మెరిసిన పూజా.. టార్గెట్ బంగారం..

రైట్ ఆర్మ్ మీడియం పేసర్ పూజా వస్త్రాకర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది. వీరితో పాటు టిటాస్ సాధు, అమంజోత్ కౌర్, రాజేశ్వరి గైక్వాడ్, దేవికా వైద్య తలో వికెట్ తీశారు.

విఫలమైన కెప్టెన్..

52 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించిన భారత మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మంధాన తక్కువ స్కోర్‌కే పెవిలియన్‌కు చేరింది. కేవలం 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మారుఫా అక్తర్ చేతిలో బలైంది. అనంతరం 40 పరుగుల వద్ద షెఫాలీ వర్మ (17) రూపంలో జట్టు రెండో వికెట్‌ కోల్పోయింది. జెమిమా రోడ్రిగ్జ్ 20 పరుగులు చేసి నాటౌట్‌గా వెనుదిరిగింది.

Tags:    

Similar News