India vs England: కోహ్లీ రికార్డుకు నరేంద్ర మోడీ సిద్ధం (ఫొటో స్టోరీ)
India vs England: గురువారం భారత్, ఇంగ్లాండ్ ల మధ్య జరగనున్న 4వ టెస్టు మ్యాచ్ కోహ్లీకి చాలా ప్రత్యేకమైంది.
India vs England: గురువారం భారత్, ఇంగ్లాండ్ ల మధ్య జరగనున్న 4వ టెస్టు మ్యాచ్ కోహ్లీకి చాలా ప్రత్యేకమైంది. అలాగే భారత సారథి కొన్ని రికార్డులను బ్రేక్ చేసేందుకు నరేంద్ర మోడీ స్టేడియం సిద్ధంగా ఉంది. ఇప్పటికే భారత్ తరపున అత్యధిక టెస్టు విజయాలు నమోదు చేసిన విరాట్ కోహ్లీ..భారత మాజీ సారథి ధోని సరసన నిలిచేందుకు అహ్మదాబాద్ వేదిక కానుంది. మరి ఆ విశేషాలేంటో చూద్దాం..
1. India vs England: ఫైనల్ టెస్టు మ్యాచ్
4 టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటికే టీం ఇండియా 2-1 తేడాతో ముందజంలో ఉంది. గురువారం జరిగే క్రికెట్ మ్యాచ్ టెస్టు సిరీస్‌లో చివరిది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో 4వ టెస్టు మ్యాచ్ జరగనుంది.
2. 60వ టెస్టు మ్యాచ్
గురువారం జరిగే మ్యాచ్ కోహ్లీకి 60వ టెస్టు మ్యాచ్. సుమారు 7 సంవత్సరాల క్రితం అడిలైడ్ లో మొదటి సారి కెప్టెన్ గా వ్యవహరించాడు.
3. ధోని సరసన కోహ్లీ
కోహ్లీ.. ఇండియా టీం తరపున ఎక్కువ టెస్టులు ఆడిన కెప్టెన్ గా ధోని రికార్డును సమం చేయనున్నాడు. ధోని 60 టెస్టులకు కెఫ్టెన్‌గా వ్యవరించాడు. ఇంగ్లాండ్ తో 4వ టెస్టు ఆడుతున్న కోహ్లీ ఈ రికార్డును సమం చేసి ధోని సరసన నిలవనున్నాడు.
4. అత్యధిక విజయాల కెప్టెన్
విరాట్ కోహ్లీ ఇప్పటికే టీం ఇండియాకు టెస్టుల్లో ఎక్కువ విజయాలు సాధించిన కెప్టెన్‌గా పేరుపొందాడు. 59 టెస్టుల్లో 35 విజయాలు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఆతర్వాత స్థానంలో ధోని (27 టెస్టు విజయాలు) ఉన్నాడు.
5. స్వదేశంలో రికార్డు
ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్టులో 10 వికెట్ల తేడాతో ఇండియా గెలుపొందింది. ఈ విజయంతో ఇండియా సారథి కోహ్లీ..ధోని రికార్డును తిరగరాశాడు. స్వదేశంలో 29 టెస్టుల్లో 22 విజయాలు సాధించి ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. మాజీ సారథి ధోని స్వదేశంలో 30 టెస్టుల్లో 21 విజయాలు సాధించాడు.