Video: బ్యాడ్మింటన్‌లో 'నో-లుక్ షాట్'.. ఒలింపిక్స్‌లో ప్రకంపనలు సృష్టించిన లక్ష్య సేన్.. వీడియో చూశారా?

Lakshya Sen Paris Olympics 2024: క్రికెట్‌లో ఎన్నో వెరైటీ షాట్లు ఉన్నాయి. వీటిని చూసి అభిమానులు ఆశ్చర్యపోతుంటారు. వాటిలో నో లుక్ షాట్ చాలా ఫేమస్. భారత వికెట్

Update: 2024-08-01 10:34 GMT

Video: బ్యాడ్మింటన్‌లో 'నో-లుక్ షాట్'.. ఒలింపిక్స్‌లో ప్రకంపనలు సృష్టించిన లక్ష్య సేన్.. వీడియో చూశారా?

Lakshya Sen Paris Olympics 2024: క్రికెట్‌లో ఎన్నో వెరైటీ షాట్లు ఉన్నాయి. వీటిని చూసి అభిమానులు ఆశ్చర్యపోతుంటారు. వాటిలో నో లుక్ షాట్ చాలా ఫేమస్. భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ దాని స్పెషలిస్ట్‌గా పరిగణిస్తుంటారు. ఇప్పుడు ఈ షాట్ పారిస్ ఒలింపిక్స్‌లో కూడా కనిపించింది. అయితే, ఈసారి అది క్రికెట్‌లో కాకుండా బ్యాడ్మింటన్‌లోనూ కనిపించింది. భారత యువ స్టార్ లక్ష్యసేన్ బుధవారం (జులై 31) అద్భుతాలు చేశాడు.

ప్రిక్వార్టర్‌ఫైనల్‌ చేరిన లక్ష్య సేన్..

పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ ఇండోనేషియాకు చెందిన మూడో సీడ్ జోనాథన్ క్రిస్టీని వరుస గేముల్లో ఓడించి సంచలనం సృష్టించాడు. దీంతో అతడు ప్రీక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. మొదటి గేమ్‌లో ఆరు పాయింట్లతో వెనుకబడిన తర్వాత, లక్ష్య అద్భుత పునరాగమనం చేసి గేమ్ చివరి దశలో క్రిస్టీని ఓడించాడు. 22 ఏళ్ల లక్ష్య ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండి కీలకమైన ర్యాలీలో అద్భుతమైన షాట్‌తో క్రిస్టీ స్ఫూర్తిని చల్లార్చాడు.

లక్ష్య అద్భుతమైన షాట్ చేశాడు. బ్యాడ్మింటన్ పరంగా ఇది ఫోర్‌హ్యాండ్ షాట్. కానీ, దీనిని వెనుక నుంచి కొట్టాడు. ఇది సరిగ్గా క్రికెట్‌లో నో-లుక్ షాట్ లాగానే ఉంది. లక్ష్య‌సేన్ కళ్ళు మాత్రం వేరేవైపు ఉండడం గమనార్హం. నెట్ మీదుగా వెళ్లడమే కాకుండా స్కోరు 20-18కి చేర్చాడు. ఆ తర్వాత రెండో గేమ్‌లో 50 నిమిషాల్లో క్రిస్టీపై 21-12 తేడాతో విజయం సాధించాడు.

తదుపరి రౌండ్‌లో ప్రణయ్‌కు గట్టి పోటీ..

క్రిస్టీతో జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో సేన్‌కి ఇది రెండో విజయం. లక్ష్య ఇప్పుడు మరో గ్రూప్ విజేతతో తలపడనున్నాడు. స్వదేశీయుడు హెచ్‌ఎస్ ప్రణయ్, వియత్నాంకు చెందిన లే డక్ ఫాట్ మధ్య జరిగే మ్యాచ్ ద్వారా నిర్ణయించనున్నారు. సమాన పాయింట్ల కారణంగా, బుధవారం సాయంత్రం సేన్, క్రిస్టీ మాదిరిగానే ప్రణయ్, డుక్ ఫట్ వర్చువల్ నాకౌట్ మ్యాచ్‌లో పాల్గొంటారు.


Tags:    

Similar News