India vs Nepal: నేపాల్‌పై ఘన విజయం.. ఆసియా క్రీడల్లో సెమీఫైనల్ చేరిన భారత్.. సెంచరీతో దంచి కొట్టిన జైస్వాల్..!
India vs Nepal, Asian Games 2023: 2023 ఆసియా క్రీడల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 23 పరుగుల తేడాతో నేపాల్‌ను ఓడించింది.
India vs Nepal, Asian Games 2023: 2023 ఆసియా క్రీడల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 23 పరుగుల తేడాతో నేపాల్‌ను ఓడించింది. దీంతో ఆసియా క్రీడల్లో భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేసి నేపాల్‌కు 203 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టీమ్ ఇండియా తరపున ఓపెనర్ యశస్వి జైస్వాల్ 49 బంతుల్లో 100 పరుగుల అత్యధిక స్కోరు నమోదు చేశాడు. అనంతరం, నేపాల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 179 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఈ ఇన్నింగ్స్‌తో జైస్వాల్ 21 ఏళ్ల తొమ్మిది నెలల 13 రోజుల వయసులో టీ20లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌పై 23 ఏళ్ల 146 రోజుల్లో సెంచరీ కొట్టిన శుభ్‌మన్ గిల్ గతంలో నెలకొల్పిన రికార్డును అతను బద్దలు కొట్టాడు.
ఇరుజట్లు:
టీమిండియా: రుతురాజ్ గైక్వాడ్ (c) , యశస్వి జైస్వాల్ , తిలక్ వర్మ , జితేష్ శర్మ ( wk ) , రింకు సింగ్ , శివమ్ దూబే , వాషింగ్టన్ సుందర్ , రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ , రవి బిష్ణోయ్ , అవేష్ ఖాన్ , అర్ష్దీప్ సింగ్.
నేపాల్: కుశాల్ భుర్టెల్ , ఆసిఫ్ షేక్ (wk) , సందీప్ జోరా , గుల్సన్ ఝా , రోహిత్ పౌడెల్ (c) , కుశాల్ మల్లా , దీపేంద్ర సింగ్ ఐరీ , సోంపాల్ కమీ , కరణ్ KC , అబినాష్ బోహారా , సందీప్ లామిచానే.