ఐపీఎల్ 13 ఎప్పుడు అనేది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించాలి : మంత్రి కిరణ్ రిజిజు
లాక్ డౌన్ ప్రభావం ప్రతి ఒక్క రంగంపైన పడింది. అందులో క్రీడా రంగం ఒకటి.. ఇప్పటికే పలు దేశాల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ లు రద్దు కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ కూడా ఆగిపోయింది.
లాక్ డౌన్ ప్రభావం ప్రతి ఒక్క రంగంపైన పడింది. అందులో క్రీడా రంగం ఒకటి.. ఇప్పటికే పలు దేశాల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ లు రద్దు కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ కూడా ఆగిపోయింది.అయితే ఇప్పుడు ఐపీఎల్ సీజన్ 13 ఎప్పుడు మొదలవుతుందన్నా అనుమానం అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 13వ సీజన్ భవితవ్యం భారత ప్రభుత్వంపై ఆధారపడి ఉందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
ఐపీఎల్ ఎప్పుడు జరుగుతుందో అనేదానికి బీసీసీఐ దగ్గర జవాబు లేదు. అది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించాలని అన్నారు. కేవలం క్రీడల కోసమని దేశ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టలేమని వెల్లడించారు.. వైరస్ ప్రభావం తగ్గేంత వరకు ఎలాంటి క్రీడా కార్యకలాపాలు నిర్వహించకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతానికైతే క్రీడల ఆలోచన సరైంది కాదని చెప్పుకొచ్చారు.
ఇక కరోనా వ్యాప్తిని మరింతగా అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ని పొడిగిస్తూ.. పలు మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రేక్షకులను అనుమతించకుండా మైదానాలు తెరుచుకునే సౌలభ్యాన్ని కలిగిచింది.. అయితే ఇన్నాళ్లుగా ఇండ్లకే పరిమితమైన ఆటగాళ్లు తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించేందుకు తగిన ఆదేశాలు మాత్రం ప్రభుత్వం తరఫునుంచి వెలువడలేదు.