Asia Cup 2023: వర్షంతో భారత్, పాక్ మ్యాచ్ మజా మిస్ అయ్యారా.. మరోసారి ఢీకొట్టనున్న చిరకాల ప్రత్యర్థులు.. ఎప్పుడంటే?

India vs Pakistan: భారత్, పాకిస్థాన్ జట్లు క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టినప్పుడల్లా అభిమానుల ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంటుంది. ఆసియా కప్-2023 గ్రూప్ మ్యాచ్ ఈ ఇద్దరి మధ్య శనివారం జరిగింది. అయితే వర్షం కారణంగా ఆట రద్దయింది.

Update: 2023-09-04 09:57 GMT

Asia Cup 2023: వర్షంతో భారత్, పాక్ మ్యాచ్ మజా మిస్ అయ్యారా.. మరోసారి ఢీకొట్టనున్న చిరకాల ప్రత్యర్థులు.. ఎప్పుడంటే?

Asia Cup 2023, IND Vs PAK: భారత్, పాకిస్థాన్ జట్లు క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టినప్పుడల్లా అభిమానుల ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంటుంది. ఆసియా కప్-2023 గ్రూప్ మ్యాచ్ ఈ ఇద్దరి మధ్య శనివారం జరిగింది. అయితే వర్షం కారణంగా ఆట పూర్తి కాలేదు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్ చేసినప్పటికీ వర్షం కారణంగా పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్‌లు మైదానంలోకి రాలేకపోయారు. ఇదిలా ఉంటే కోట్లాది మంది భారత్, పాకిస్థాన్ అభిమానులకు మరో శుభవార్త వచ్చింది.

ఉత్కంఠతకు అడ్డుపడిన వర్షం..

సెప్టెంబరు 2వ తేదీ శనివారం ఆసియా కప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉంది. ఇప్పటికే వర్షం పడే సూచన ఉంది. చెడు వాతావరణం, వర్షం అనేక సార్లు అంతరాయం కలిగించాయి. భారత జట్టు బ్యాటింగ్ పూర్తయింది. కానీ ఆ తర్వాత వర్షం కారణంగా పాక్ బ్యాట్స్‌మెన్ దిగలేకపోయారు. చివరికి మ్యాచ్‌ను రద్దు చేశారు. కోట్లాది మంది అభిమానుల్లో నిరాశను నింపారు. ఇప్పుడు మళ్లీ ఈ రెండు జట్ల మధ్య పోటీని చూసే అవకాశం ఉంది.

పాకిస్థాన్ సూపర్ 4 టికెట్..

భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌ని అభిమానులు మరోసారి వీక్షించవచ్చు. వర్షం కారణంగా మ్యాచ్ అసంపూర్తిగా మిగిలిపోయింది. అయితే, బాబర్ అజామ్ నేతృత్వంలోని జట్టు సూపర్ -4 టిక్కెట్‌ను పొందింది. భారత జట్టు ఇంకా చిక్కుల్లోనే ఉంది. నేడు నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి సూపర్-4లో చోటు దక్కించుకోవాలని చూస్తోంది. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయినా.. రోహిత్ శర్మ అండ్ కో సూపర్-4కు అర్హత సాధిస్తుంది. గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్, నేపాల్ ఉన్నాయి.

భారత్, పాక్ పోరు ఎప్పుడంటే..

పాకిస్తాన్ ఇప్పటికే సూపర్ 4కి అర్హత సాధించింది. నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో భారత జట్టు గెలిచే అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో రెండు జట్లు మరోసారి సూపర్-4లో ఢీకొంటాయని తెలుస్తోంది. ఇప్పుడు భారత్‌, పాకిస్థాన్‌లు గ్రూప్‌-బిలోని మరో రెండు జట్లతో చేరి తదుపరి రౌండ్‌కు వెళ్లనున్నాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, గ్రూప్ A (భారతదేశం, పాకిస్తాన్, నేపాల్) రెండు క్వాలిఫైయింగ్ జట్లు సూపర్ 4 లో ఒకదానితో ఒకటి తలపడతాయి. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 10న (ఆదివారం) కొలంబో వేదికగా జరగనుంది.

ఫైనల్‌లోనూ చిరకాల ప్రత్యర్థుల పోటీ?

ఆసియా కప్‌లో ఆఖరి మ్యాచ్‌కు అర్హత సాధించే రెండు జట్లుగా భారత్, పాకిస్థాన్‌లు నిలిచే బలమైన అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం అఫ్గానిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు సూపర్-4 దశకు చేరుకోవడానికి కష్టపడుతున్న మిగతా 3 జట్లు. సెప్టెంబరు 17న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుందని అంతా భావిస్తున్నారు. ఆసియా కప్‌లో టీమిండియా తన మొదటి మ్యాచ్‌ని పాకిస్థాన్‌తో క్యాండీలో ఆడింది. మెన్ ఇన్ గ్రీన్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. షాహీన్ షా ఆఫ్రిది 4 వికెట్లు తీయగా, నసీమ్ షా, హరీస్ రవూఫ్ తో 3 వికెట్లు తీశారు. భారత్ తరపున వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ సెంచరీలను కొద్దిలో కోల్పోయారు.

Tags:    

Similar News