Vinesh Phogat: పబ్లిసిటీ కోసమే పీటీ ఉష అలా చేసింది.. నాకు మద్దతే ఇవ్వలేదు: వినేశ్‌ ఫొగాట్ సంచలన వ్యాఖ్యలు..!

Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) ఫైనల్‌ నుంచి అనూహ్యంగా అనర్హత వేటు పడిన వినేశ్‌ ఫొగాట్‌కు.. కొద్దిలో పతకం మిస్సయిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-11 06:54 GMT

Vinesh Phogat: పబ్లిసిటీ కోసమే పీటీ ఉష అలా చేసింది.. నాకు మద్దతే ఇవ్వలేదు: వినేశ్‌ ఫొగాట్ సంచలన వ్యాఖ్యలు..!

Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) ఫైనల్‌ నుంచి అనూహ్యంగా అనర్హత వేటు పడిన వినేశ్‌ ఫొగాట్‌కు.. కొద్దిలో పతకం మిస్సయిన సంగతి తెలిసిందే. ఎన్నో వివాదాల మధ్య ఆమెకు విపరీతంగా మద్దతు పెరిగింది. ఈ క్రమంలో భారత్‌కు తిరిగొచ్చిన ఆమెకు ఘనమైన స్వాగతం అందింది. ఈ క్రమంలో వినేశ్‌ ఫొగాట్‌ తన అనర్హతపై అప్పీలు చేసింది. అయితే, ఈ కేసును కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్‌ ఫర్ స్పోర్ట్స్ (కాస్) కొట్టేయడంతో ఫొగాట్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇదే సమయంలో ఆగ్రహానికి గురైన ఫొగాట్ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికింది. వినేశ్‌ ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో వినేశ్‌ ఫొగాట్‌ మాట్లాడుతూ.. పీటీ ఉషతోపాటు భారత ఒలింపిక్‌ సంఘంపై విరుచుకపడింది. నాకు మద్దతు ఇవ్వడంలో ఆలస్యం చేశారు. వీళ్ల కారణంగా కాస్‌లో తీర్పు వ్యతిరేకంగా వచ్చింది. పీటీ ఉష కేవలం ఫొటోల కోసం నా వద్దకు వచ్చింది. సోషల్ మీడియాలో పోస్టు చేసి, చేతులు దులుపుకుందని విమర్శించారు.

ఈ క్రమంలో ఫొగాట్ మాట్లాడుతూ.. ‘‘ పీటీ ఉష నా దగ్గరకు వచ్చి నాకేమీ చెప్పకుండా ఫొటోలు దిగారు. ఆ తర్వాత ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పబ్లిష్ చేశారు. ఆ పోస్ట్‌లకు ‘మేమంతా నీతోనే ఉన్నాం’ అంటూ గొప్పగా క్యాప్షన్ ఇచ్చారు. మరి మద్దతు ఇచ్చినప్పుడు వారాంత నా పక్కన నిలబడాలి. కానీ, వారు అలా చేయలేదు. కనీసం నా ఆరోగ్యం గురించి కూడా పీటీ ఉష అడగలేదు. బిల్డప్ కోసమే అలా చేశారు. అదంతా ఓ రాజకీయం అంటూ కొట్టిపారేసింది.

ఇక కేస్ విషయానికి వస్తే.. 'కాస్‌లో నా పేరుతోనే కేసును ఫైల్‌ చేశాను. అసలైతే దేశం తరపున చేయాలి. ప్రభుత్వంతోపాటు ఐవోఏ నుంచి మద్దతు లేదు. నేను ఒంటరిగానే పోరాడాను. హారీశ్‌ సాల్వే నా కేసును వాదించేందుకు సహాయపడ్డారు. నాకు మద్దతు, అండగా నిలబడాల్సిన వాళ్లు.. మీడియా ముందు షోలు చేయడంలో బిజీగా ఉండిపోయారు. బ్రిజ్‌ భూషణ్‌పై మాకు ముందు నుంచి నమ్మకంలేదు. ఒంటిరిగా పోరాడం కాబట్టి, మేం ఓడిపోయాం’’ అంటూ వినేశ్‌ తెలిపారు.

Tags:    

Similar News