కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ కు తొలి స్వర్ణం

Commonwealth Games 2022: గోల్డ్ మెడల్ సాధించిన మీరాబాయి చాను

Update: 2022-07-31 01:32 GMT

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ కు తొలి స్వర్ణం

Commonwealth Games 2022: బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్ వెల్త్ క్రీడల్లో భారత్ కు తొలి స్వర్ణ పతకం లభించింది. వెయిట్ లిప్టింగ్ లో 49 కిలోల విభాగంలో స్టార్ వెయిట్ లిప్టర్ మీరాబాయి ఛాను 201 కేజీల బరువు ఎత్తి అగ్రస్థానంలో నిలిచింది. స్నాచ్ విభాగంలో 88 కేజీలు ఎత్తిన మీరాబాయి చాను క్లీన్ అండ్ జర్క్ లో 113 కేజీల బరువు ఎత్తి రికార్డు సృష్టించింది. 2018లోనూ కామన్ వెల్త్ క్రీడల్లోనూ మీరాబాయి చాను భారత్ కు తొలి స్వర్ణం అందించింది.

కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం మూడు పథకాలు లభించాయి. వెయిట్ లిఫ్టింగ్ లో 55 కేజీల విభాగంలో పోటీపడిన భారత వెయిట్ లిఫ్టర్ సంకేత్ మహదేవ్ సార్గర్ రజత పథకం సాధించాడు. 61 కేజీలి కేటగిరిలో గురురాజ కాంస్య పథకం సాదించాడు. స్నాచ్ ఈవెంట్ లో 113 కేజీలు ఎత్తి స్పష్టమైన లీడ్ సాధించిన సంకేత్ క్లీన్ అండ్ జర్క్ విఙాగంలో తొలిప్రయత్నంలోనే 135 కేజీలు ఎత్తి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లో 139 కేజీలు ఎత్తేందుకు ట్రై చేసి విఫలమయ్యాడు. మూడో ప్రయత్నించి విఫలం అయ్యాడు.

Tags:    

Similar News