India Women's: ఏడేళ్ల తర్వాత ఇంగ్లాండ్ తో టెస్ట్ .. జట్టులో ఎవరెవరంటే?

India Women's: టీమిండియా ఉమెన్స్ టీం చివరి సారిగా 2014లో మైసూర్ వేదికగా సౌతాఫిక్రాతో టెస్ట్ మ్యాచ్ ఆడింది.

Update: 2021-05-15 07:55 GMT

ఇండియన్ విమెన్స్ టీం (ఫైల్ ఇమేజ్)

India Women's: టీమిండియా ఉమెన్స్- ఇంగ్లాండ్ ఉమెన్స్ మ‌ధ్య మ‌రో ఆస‌క్తి పోరు జ‌ర‌గ‌నుంది. ఏకైక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు సిరీస్ లో భాగంగా భారత్ మ‌హిళా జ‌ట్టు ఇంగ్లాండ్ లో అడుగుపెట్ట‌నుంది.ఇంగ్లాండ్ జట్టుతో మహిళా జట్టు ఏకైక టెస్ట్ ఆడనున్నది. దాదాపు ఏడేళ్ల తర్వాత భారత మహిళా జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడుతుండటం విశేషం. ఈ పర్యటనకు వెళ్లే భారత మహిళా జట్టును శుక్రవారం బీసీసీఐ మహిళా సెలెక్షన్ కమిటీ ప్రకటించింది.

టీమిండియా ఉమెన్స్ టీం చివరి సారిగా 2014లో మైసూర్ వేదికగా సౌతాఫిక్రాతో టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఇన్నింగ్స్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత జట్టు గత 16 ఏళ్లలో కేవలం మూడే టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 2006, 2014లో ఇంగ్లాండ్ పర్యటనలో ఒక్కో టెస్ట్ ఆడింది. రెండింటిలోనూ భారత మహిళా జట్టు విజయం సాధించింది.

వన్డేలకు మిథాలీ రాజ్ కెప్టెన్‌గా..వికట్‌కీపర్, బ్యాటర్ ఇంద్రానీ రాయ్ తొలి సారిగా టెస్ట్, వన్డే జట్టులోకి వచ్చింది. కాగా, ఎడమచేతి వాటం స్పిన్నర్ రాజేశ్వరీ గైక్వాడ్ గాయం కారణంగా ఈ పర్యటనకు ఎంపిక కాలేదు. టెస్ట్, అదే సమయంలో టీ20లకు హర్మాన్ ప్రీత్ కౌర్‌ను కెప్టెన్‌గా కాన‌సాగ‌త‌నుంది. టీంమిండియా పురుషుల జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే సమయంలోనే భారత మహిళా జట్టు కూడా ఇంగ్లాండ్‌లో క్రికెట్ ఆడనున్నది.

భారత మహిళా టెస్ట్, వన్డే జట్టు : మిథాలీ రాజ్ (కెప్టెన్), ,హర్మన్ ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన పూనమ్ రౌత్, ప్రియ పూనియ, దీప్తి శర్మ, జెర్మిమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, స్నేహ్ రాణా, తనియా భాటియా (వికెట్ కీపర్), ఇంద్రణీ రాయ్ (వికెట్ కీపర్), శిఖా పాండే, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఎక్తా బిస్త్, రాధా యాదవ్, ఝులన్ గోస్వామి.

భారత మహిళా టీ20 జట్టు : హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, జెర్మిమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, రిచా ఘోష్, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణా, తనియా భాటియా (కీపర్), ఇంద్రాణీ రాయ్ (కీపర్), శిఖా పాండే, ఎక్తా బిస్త్, రాధా యాదవ్, సిమ్రన్ దిల్ బహదూర్,పూజా వస్త్రాకర్, అరుంధతీ రెడ్డి, పూనమ్ యాదవ్.

Tags:    

Similar News