Tokyo Olympics: మహిళల హాకీ టీమ్ ప్లేయర్ వందనా కటారియాకు వేధింపులు.. ఓటమిపై అగ్రవర్ణాల..
Tokyo Olympics: ఒలింపిక్స్ లో మహిళల హాకీ టీమ్ ఓడిపోయినా అద్భుతమైన ప్రతిభా పాటవాలు ప్రదర్శించినందుకు దేశమంతా ప్రశంసిస్తుంటే..
Tokyo Olympics: ఒలింపిక్స్ లో మహిళల హాకీ టీమ్ ఓడిపోయినా అద్భుతమైన ప్రతిభా పాటవాలు ప్రదర్శించినందుకు దేశమంతా ప్రశంసిస్తుంటే కొందరు అగ్రవర్ణ దురహంకారులు మాత్రం టీమ్ ప్లేయర్ల కుటుంబాలను టార్గెట్ చేసుకుని వేధిస్తున్నారు. ఒలింపిక్స్ కు వెళ్లిన మహిళల హాకీ టీమ్ లో ఉన్న వందనా కటారియా కుటుంబాన్ని హరిద్వార్ లో అగ్రవర్ణాలు టార్గెట్ చేశాయి.
మహిళల హాకీ లో ఓటమికి కారణం టీమ్ లో మెజారిటీ దళితులు ఉండటమేనంటూ సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని వారిపై విషం కక్కుతున్నారు. వందన ఇంటికి సమీపంలో ఉన్న అగ్రవర్ణ కుటుంబాలు హాకీ టీమ్ ఓటమిని సెలబ్రేట్ చేసుకుంటూ పటాకులు కాల్చి, వ్యంగ్యంగా డాన్సులు చేశారు. అంతేకాదు వందన కుటుంబాన్ని కులపరమైన వ్యాఖ్యలతో వేధించారు కూడా.