పుణే వేదికగా భారత్ శ్రీలంక మధ్య నిర్ణయాత్మక మూడో టీ20లో జరుగనుంది. టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయింది. 18 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. మనిష్ పాండే (18), ఠాకుర్ (8) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ ధావన్(52 పరుగులు, 36 బంతుల్లో, 7ఫోర్లు, 1 సిక్స్) ఔట్ అయ్యాడు. ఓపెనర్లు ఇద్దరు కలిసి 10 ఓవర్లలో తొలి వికెట్ కు 97 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. లక్షణ్ సందాకన్ బౌలింగ్ లో గుణతికకి క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. ఆనంతరం సంజుశాంసన్ రెండు బంతులు ఎదుర్కొని ఒక భారీ సిక్స్ సాధించాడు. అయితే హసరంగా బౌలింగ్ లో ఎల్ బీడబ్యూ రూపంలో ఔటైయ్యాడు. మరోవైపు రాహుల్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసి లక్షణ్ సందాకన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. కోహ్లీ 26 పరుగులు చేసి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.